వెల్గటూర్: పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అధి కారులను ఆదేశించారు. ఎండపల్లి మండలం కొత్తపేట జిన్నింగ్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా కొనాలని సూచించారు. పారదర్శకత పాటించాలని ఆదేశించారు. ఏఎంసీ చైర్మన్ గోళ్ల తిరుపతి, సర్పంచులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు
ధర్మపురి: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి అడ్లూరి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల ప ట్టాలు పంపిణీ చేశారు. ఇల్లులేని వారందరికీ ఇళ్లు అందిస్తామన్నారు. వివిధ గ్రామాల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రవీందర్ న్నారు.
కిడ్నీ బాధితుడి వైద్యానికి రూ.1.30 లక్షలు సాయం
ధర్మపురి: ఒక వైపు పేదరికం.. అద్దె ఇంట్లో నివాసం. మరోవైపు రెండు కిడ్నీలు చెడిపోయి వైద్యం కోసం ఇబ్బంది పడుతున్న దైన్యం. అలాంటి ఓ నిరుపేద బాధితుడి వైద్య ఖర్చులకు ఫేస్‌బుక్ పోస్టుకు స్పందించిన దాతలు రూ.1.30 లక్షలు విరాళాలు అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాకేంద్రానికి చెందిన నీలం నర్సింహులు కారు డ్రైవర్. వచ్చిన సంపాదనతో భార్య, ముగ్గురు కూతుళ్లను పోషించుకుంటున్నాడు. కొన్నేళ్ల క్రితం నర్సింహులుకు రెండు కిడ్నీలు చెడిపోయాయి. అప్పటినుంచి ఇంటివద్దనే ఉంటున్నాడు. భార్య భాగ్యలక్ష్మి పలువురి ఇళ్లలో వంట పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. నర్సింహులు కిడ్నీ మార్పిడి కోసం వైద్యపరంగా ఇబ్బంది పడుతున్నాడు. వీరి సమస్యను తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణుకుంట రమేశ్ గత నెల 3న ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి సాయం అందించాలని కోరాడు. ఎన్నారైలు, ఇతర దాతలు బాధితుడి బ్యాంకు ఖాతాకు రూ.1.30 లక్షలు విరాళాలుగా పంపించారు. నర్సింహులుకు నవంబర్‌లో కిడ్నీ మార్పిడి చికిత్స జరుగుతుందని రమేశ్ తెలిపాడు.
రాష్ట్రస్థాయి పోటీలకు వెల్లుల విద్యార్థులు
మెట్‌పల్లిరూరల్: ఎస్జీఎఫ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌లో మెట్‌పల్లి మండలం వెల్లుల జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరి చారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో జరి గిన పోటీల్లో అండర్–17 విభాగంలో రేస్‌వాక్‌లో జెట్టి ప్రజ్ఞ, రన్నింగ్‌లో జెట్టి మోక్ష ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వీరిని హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి అభినందించారు.
మల్యాల గురుకులం విద్యార్థి
మల్యాల: తాటిపల్లి బాలికల గురుకులం విద్యార్థిని ఆర్.మనీష అథ్లెటిక్స్ పో టీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మానస తెలి పారు. జిల్లాస్థాయి పోటీల్లో 3వేల మీటర్ల పరు గు పందెంలో ప్రతిభ కనబరిచినట్లు వివరించారు.
కబడ్డీ పోటీల్లో మగ్గిడి విద్యార్థులు..
ధర్మపురి: మండలంలోని మగ్గిడి ఆదర్శ పాఠశాల విద్యార్థులు పీఎంశ్రీ జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించారు. వారిలో ముగ్గురు విద్యార్థులు వంశీ, ఎండీ.హంగ్య, మహ్మద్ మత్‌లబ్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ మహేష్ పిడి రాజేందర్‌లు అభినందించారు.
బాల్య వివాహాలు చేయొద్దు
జగిత్యాలరూరల్: బాల్య వివాహాలు అరికట్టడం అందరి బాధ్యత అని జిల్లా సంక్షేమాధికారి భాస్కర్ అన్నారు. శనివారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని మహిళాఅభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ధరూర్, లక్ష్మీపూర్ బీసీ బాలికల పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. బాలికల హక్కులు కాపాడాలన్నారు. డీఎంహెచ్‌వో సుజాత మాట్లాడుతూ బాలికలు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి జయరాజ్, డీసీపీయూ, హెచ్‌యూబీ, సఖీ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.


