21 నుంచి పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు | - | Sakshi
Sakshi News home page

21 నుంచి పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు

Oct 16 2026 7:23 AM | Updated on Oct 16 2026 7:23 AM

జగిత్యాలక్రైం: పోలీస్‌ అమరవీరుల సంస్మరణలో భాగంగా ఈనెల 21 నుంచి 31 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎస్పీ అశోక్‌కుమార్‌ గురువారం పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో ఆన్‌లైన్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విద్యార్థులకు పోలీసులు వినియోగించే ఆయుధాలు, విధులు తదితర అంశాలపై అవగాహన కల్పించడం, ఆఫ్‌లైన్‌ ద్వారా ప్రతీ పోలీస్‌స్టేషన్లో విద్యార్థులకు స్టేషన్‌ నిర్వహణపై వివరించనున్నట్లు తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు. 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సైబర్‌ నేరాల నివారణలో పౌరులు, మాదకద్రవ్యాల ముప్పు– వాటి నివారణలో పోలీసుల పాత్ర, డిగ్రీ ఆపై చదువుతున్న విద్యార్థులకు సోషల్‌ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర. తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చడంలో నా పాత్ర అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈనెల 28 వరకు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని, ప్రతిభచాటిన ముగ్గురిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, సైకిల్‌ ర్యాలీ, పబ్లిక్‌ స్థలాల్లో, పోలీస్‌ అమరవీరుల గురించి తెలుపుతూ కళాబృందంతో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement