అమ్మకు బోనం
రాయికల్ పట్టణంలోని విశ్వపాలిని సేవ సమితి, చండిపరివార్, నవదుర్గ సేవ సమితి, కుమ్మరిపల్లి, మైతాపూర్, ఆలూరు గ్రామాల్లో గురువారం రాత్రి దుర్గమ్మతల్లికి బోనాల మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మపురి పట్టణంలో నవదుర్గా సేవాసమితి ఆధ్వర్యంలో బోనాల వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం నుంచి నంది కూడలి మీదుగా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అమ్మవారల వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు.
– రాయికల్/ధర్మపురి


