కార్మికులకు అండ | - | Sakshi
Sakshi News home page

కార్మికులకు అండ

Oct 15 2026 8:48 AM | Updated on Oct 15 2026 8:48 AM

ఉద్యమాలు, ఉత్పత్తిలోనూ సింగరేణి కార్మికులే మొనగాళ్లు

తెలంగాణ సాధనలో శ్రామికుల పోరాటం మరువలేనిది

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు

సింగరేణి కార్మిక గర్జన బహిరంగ సభ విజయవంతం

గులాబీ జెండానే

శాకంబరీ రూపంలో అమ్మవారు

ధర్మపురి: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బుధవారం శాకంబరీగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో నాలుగోరోజు అమ్మవారికి చండీ పారాయణం, దేవిభాగవత పారాయణం, కన్యకాసుహాసిని తదితర పూజలు చేశారు. ఆలయ ఈవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

దుర్గమాతకు బోనాలు

జగిత్యాలరూరల్‌:జగిత్యాల రూరల్‌ మండలం పొరండ్లలోని దుర్గసేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారికి బుధవారం సాయంత్రం మహిళలు బోనాలు సమర్పించారు. డప్పులచప్పుళ్లు మధ్య శోభాయాత్రగా ఆలయానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

శేష వాహనంపై శ్రీలక్ష్మీనృసింహుడు

ధర్మపురి: శరన్నవరాత్రోత్సోవాల సందర్భంగా ధర్మపురిలో శ్రీయోగ, శ్రీఉగ్రలక్ష్మీనృసింహస్వాములు శేషవాహనంపై ఊరేగారు. దారి పొడవునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ధర్మకర్తల మండలి చైర్మన్‌ జక్కు రవీందర్‌, ఈవో శ్రీనివాస్‌ అర్చక బృందం తదితరులున్నారు.

సాక్షి పెద్దపల్లి/గోదావరిఖని:

బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా, ఉద్యమాల్లోనూ సింగరేణి కార్మికులే మొనగాళ్లని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభివర్ణించా రు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించే కార్మికులు, జీతాలు, బోనస్‌ కోసం కాకుండా రాష్ట్ర సాధనలో ముందున్నారని ప్రశంసించారు. వారి కష్టాలు, త్యాగాలు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయని, కేసీఆర్‌ నాయకత్వంలో సబ్బండ వర్గాలు ఏకమై ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించుకున్నాయని అన్నారు. గోదావరిఖని సింగరేణి స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేసిన సింగరేణి కార్మిక గర్జన బహిరంగ సభలో మాట్లాడారు. కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను కొనసాగిస్తే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. వాటాలు, బేరాలు కుదరక నైనీ బొగ్గు బ్లాక్‌ టెండర్లు రద్దయ్యాయని కేటీఆర్‌ ఆరోపించారు.

సకలజనుల సమ్మెలో కీలకపాత్ర

సకలజనుల సమ్మెలో 42 రోజుల పాటు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయేలా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని గుర్తుచేశారు. దక్షిణ భారతదేశంలో విద్యుత్‌ సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందని పేర్కొన్నారు. కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమానికి పిలుపునిచ్చిన ప్రతీసారి కార్మికలోకం అండగా నిలిచిందన్నారు. కేసీఆర్‌ ఆమరణ దీక్షలోనూ ఏడు రోజుల పాటు ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు.

గోదావరిఖని బిడ్డ.. మస్తు తీసిండు..

శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్‌ సినిమా’లో కేసీఆర్‌ పాత్రను అద్భుతంగా చూపించారని కేటీఆర్‌ ప్రశంసించారు. అణచివేతకు గురైన జాతి ఎలా తిరగబడుతుంది? ఆ పోరాటానికి నాయకత్వం వహించే నేత ఎలా ప్రజలను ఏకం చేసి విజయాన్ని సాధిస్తారు? అనే అంశాలను వివరించినట్లు తెలిపారు. బహిరంగసభలో నాయకులు జీవన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, గండ్ర సత్యనారాయణ, కోవ లక్ష్మి, చిన్నయ్య, మధుసూదనాచారి, కౌశిక హరి, వ్యాళ్ల హరీశ్‌రెడ్డి పాల్గొన్నారు.

బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్‌ సత్యప్రసాద్‌, వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులు

జగిత్యాల/జగిత్యాలటౌన్‌/జగిత్యాలజోన్‌: ఆడబిడ్డల ఆత్మగౌరవం, సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. మహిళాభివృద్ధి, సీ్త్రశిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పూలను పూజించే ఏకై క పండుగ బతుకమ్మ అన్నారు. అదనపు కలెక్టర్‌ ప్రసూనాంబ, డీబ్ల్యూవో భాస్కర్‌, ఈడీఎం మమత, మహిళా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా కోర్టులో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి, మొదటి అదనపు జడ్జి సునీత, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సరిత, రెండో అదనపు జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ నిఖిషా, మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది బతుకమ్మ ఆడారు. సబ్‌ జడ్జి నాగేశ్వర్‌రావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, కార్యదర్శి అందె మారుతి, జ్యూడిషియల్‌ ఎంప్లాయీస్‌ అధ్యక్షుడు మొగిలి మోహన్‌, ప్రధాన కార్యదర్శి పి.శైలజ, న్యాయవాదులు పాల్గొన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మహాబతుకమ్మ శోభాయాత్ర మినీస్టేడియం నుంచి మున్సిపల్‌ కార్యాలయం వరకు సాగింది. మున్సిపల్‌ కార్యాలయం ముందు బతుకమ్మ ఆడారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి, ఎమ్మెల్యే సతీమణి రాధిక, మహిళ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement