డంపింగ్‌యార్డు సమస్య పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

డంపింగ్‌యార్డు సమస్య పరిష్కరించాలి

Oct 24 2026 12:22 AM | Updated on Oct 24 2026 12:22 AM

జగిత్యాల: డబుల్‌బెడ్రూం కాలనీ సమీపంలోని డంపింగ్‌యార్డు సమస్యను పరిష్కరించాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రెండు రోజుల నుంచి డంప్‌యార్డులో మంటలు ఎగిసిపడుతున్నాయని, కాలనీవాసులు ఉండలేక బంధువుల ఇళ్లకు వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. కొందరు అస్వస్థతకు గురై జగిత్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. డంప్‌యార్డులో తడి, పొడి చెత్తను వేరు చేసి రిసైక్లింగ్‌ చేసే సిస్టం ఉన్నప్పటికీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఆ కాలనీలో 4వేల కుటుంబాలు నివసిస్తున్నాయని, వారి ఆరోగ్యం కూడా ప్రధానమని, అధికారులు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఫైరింజన్‌ సైతం పంపించడం లేదని, కాలనీలో శానిటేషన్‌ వర్కరును ఏర్పాటు చేయాలన్నారు. సమస్యను తొందరగా పరిష్కరించాలని లేకుంటే ప్రజలు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement