ఇబ్రహీంపట్నం: కేసీఆర్ హయాంలో మూలరాంపూర్ శివారులో గోదావరిపై సదర్‌మాట్ ప్రాజెక్టును నిర్మించడంతో నేడు గోదావరిలో బ్యాక్‌వాటర్‌తో నిండిపోయి ఎర్దండి, కోమటికొండాపూర్, నిజామాబాద్ జిల్లా గుమ్మిర్యాల వరకు గోదావరిలో నిండుగా నీళ్లు ఉండి కళకళలాడుతుందని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఎర్దండి వద్ద గోదావరిని, పుష్కరఘాట్‌ల నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ సారి వర్షాలు లేక ఎక్కడా ప్రాజెక్టులు నిండలేదని, కానీ సదర్‌మాట్ ప్రాజెక్టు పుణ్యమా అని గోదావరిలో నీళ్లు ఉండి జలకల కనిపిస్తుందన్నారు. నాణ్యతతో పుష్కరఘాట్‌ల నిర్మాణం, తదితర పనులను గ్రామస్తులు చేయించుకొవాలని సూచించారు. మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఏలాల ధశరత్‌రెడ్డి, రాజన్న, ఏలేటి చిన్నారెడ్డి, బద్దం గోపి, జేడీ సుమన్, నేమూరి సత్యనారాయణ, చక్రీ తదితరులు పాల్గొన్నారు.
ఇన్నోవేటర్స్ ప్రాజెక్టులో విద్యార్థులు పాల్గొనాలి
జగిత్యాల: తెలంగాణ ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ చాలెంజ్ పోటీల్లో విద్యార్థులు విస్తృతంగా పాల్గొనాలని, ఇందుకు విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని జిల్లా విద్యాశాఖాధికారి రాము పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో సృజనాత్మకత, శాసీ్త్రయ ధృక్పథం, ఆవిష్కరణ నైపుణ్యాలను వెలికితీయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఫూచర్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ 2026–27 కార్యక్రమంలో 6 నుంచి 10 వ తరగతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొనాలని కోరారు. ఎంపికై న విద్యార్థులకు నవంబర్ 14న హైదరాబాద్‌లో బహుమతులు అందజేస్తారని పేర్కొన్నారు. విద్యార్థుల ఆవిష్కరణలను నవంబర్ 6వరకు పోర్టల్ ద్వారా స్వీకరిస్తారని తెలిపారు. ఇందులో జెడ్పీహెచ్‌ఎస్, కేజీబీవీ, టీజీఎంఎస్, టీఆర్‌ఈఐఎస్, యూపీఎస్ పాఠశాలల విద్యార్థులు పాల్గొనడానికి అర్హులని పేర్కొన్నారు. నవంబర్ 6 వరకు తెలంగాణ పొర్టల్‌లో లాగిన్ కావాలని, మరింత సమాచారం కోసం ఆయా పాఠశాలల్లో సంప్రదించాలని సూచించారు. ఈ పోటీల్లో ఒక్క విద్యార్థి వ్యక్తిగతంగా లేదా గరిష్టంగా ముగ్గురు విద్యార్థుల బృందంగా పాల్గొనవచ్చని తెలిపా రు. ఆరు దశల్లో ఈ పోటీల్లో జరుగుతాయని, ఇందుకు విద్యార్థులను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ప్రొత్సహించి, వారు పాల్గొనేలా అవగాహన కల్పించాలని సూచించారు.
నిర్మల్: నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లిలో మహా పోచమ్మను శుక్రవారం ఎమ్మెల్సీ ఎల్.రమణ కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పూజారి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి చిత్రపటం బహూకరించి తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు. డీటీవో అజయ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాంకిషన్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ దేవిశంకర్, లక్ష్మీనారాయణగౌడ్, మోతేవార్ లక్ష్మణ్, వంగ చంద్రశేఖర్‌రెడ్డి, ధనుంజయ్ ఉన్నారు.
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు గురుకుల విద్యార్థి
మల్యాల: మండలంలోని తాటిపల్లి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థిని టి.హరిణి రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మానస తెలిపారు. జిల్లాస్థాయి పోటీల్లో అండర్–17 విభాగంలో హరిణి ప్రతిభచాటింది. ఈ నెల 25 నుంచి 27 వరకు రంగారెడ్డి జిల్లాలో నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని, పీఈటీ మధులికను ప్రిన్సిపాల్ అభినందించారు.


