ధర్మపురి: వ్యవసాయ రంగంలో ఉత్తమ పద్ధతులు పాటిస్తూ.. వివిధ రకాల పంటలు పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న విజయలక్ష్మి జిల్లా ఉత్తమ మహిళా రైతు అవార్డుకు ఎంపికై ంది. ధర్మపురి మండలం నర్సయ్యపల్లె పరిధిలోని శాలపల్లె గ్రామానికి చెందిన కట్కం విజయలక్ష్మి తన వ్యవసాయ పొలంలో వివిధ రకాల కూరగాయలు, వరి సాగు చేస్తోంది. పాడిఆవులను పెంచుతూ సేంద్రియ ఎరువులను పంటలకు వినియోగిస్తోంది. వ్యవసాయ సాంకేతికను, శాసీ్త్రయ పద్ధతులు అనుసరిస్తూ పంటలు పండిస్తోంది. ఆమె కృషికి గుర్తింపుగా బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కిసాన్ మేళాలో ఉత్తమ మహిళా రైతు అవార్డును మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అందించారు.


