కబడ్డీ.. కబడ్డీ | - | Sakshi
Sakshi News home page

కబడ్డీ.. కబడ్డీ

Oct 3 2026 12:26 AM | Updated on Oct 3 2026 12:26 AM

కబడ్డీ ఆడుతున్న విప్‌ శ్రీనివాస్‌, రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేశ్‌ బీ గీతే

మార్చ్‌ఫాస్ట్‌ చేస్తున్న జగిత్యాల జిల్లా జట్టు

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 52వ రాష్ట్రస్థాయి బాలుర కబడ్డీ పోటీలు, 36వ రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నాలుగురోజుల పాటు జరిగే పోటీలను ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఒలింపిక్స్‌ జెండాను ప్రభుత్వవిప్‌ ఆది శ్రీనివాస్‌, ఎస్పీ మహేశ్‌ బీ గీతే ఆవిష్కరించి టార్చ్‌ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 68 జట్లకు చెందిన 1,300 మందికి పైగా క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు, పీఈటీలు, పీడీలు హాజరయ్యారు.యువత మైదానాల్లో ఉండాలని, మత్తులో కాదనీ, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు. వేములవాడ ప్రాంతానికి కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో వంటి గ్రామీణ క్రీడలతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. మున్సి పల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, వైస్‌చైర్మన్‌ నరాల శేఖర్‌, కబడ్డీ అసోసియేషన్‌ రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement