జగిత్యాలజోన్: జగిత్యాల స్పెషల్ సబ్ జైలులో శుక్రవారం ఖైదీల సంక్షేమ దినోత్సవం జరిగింది. జగిత్యాల సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ఖైదీలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఖైదీల సంక్షేమానికి జైళ్లశాఖ చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. జైలర్ మొగి లేశ్, జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కటు కం చంద్రమోహన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య పాల్గొన్నారు.
జ్యుడీషియల్ ఎంప్లాయీస్ కార్యవర్గం ఎన్నిక
జగిత్యాలజోన్: జిల్లా జ్యుడీషియల్ ఎంప్లాయీస్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మొగిలి మోహన్, అసో సియేట్ అధ్యక్షుడిగా ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా మహ్మద్ రయాన్, కె.ప్రదీప్‌కుమార్, కె.వసంత, ప్రధాన కార్యదర్శులుగా శైలజ, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మహ్మద్ హబిబుద్దీన్, సంయుక్త కార్యదర్శులుగా ఆర్.చంద్రశేఖర్, వి.శ్రీకాంత్, ఎం.తిరుపతి, కోశాధికారిగా గంగారెడ్డి ఎన్నికయ్యారు.
ప్రణాళికతో ముందుకెళ్లాలి
జగిత్యాల రూరల్: గ్రామాల అభివృద్ధికి ప్రణాళికతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ సూచించారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛత హి సేవా, వీబీజీరాంజీ ప్రత్యేక గ్రామసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాత్మగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి, స్వచ్ఛత హి సేవ కార్యక్రమం ప్రారంభించారు. పారిశుధ్యం, తడి–పొడి చెత్త నిర్వహణ, పరిశుభ్రమైన పరిసరాల పరిరక్షణపై ప్రజలకు అవగాహన క ల్పించాలన్నారు. సర్పంచ్ నక్క హరీశ్, డిప్యూ టీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, ఎంపీవో రవిబా బు, ఉపసర్పంచ్ ఎం.మల్లేశం పాల్గొన్నారు.
పేదింటి ఆడబిడ్డలకు మేనమామ కేసీఆర్
జగిత్యాల: పేదింటి ఆడబిడ్డలకు మేనమామలా కేసీఆర్ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టారని, పథకం నేటికి 12 ఏళ్లు పూర్తి చేసుకుందని మాజీ జెడ్పీచైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. ఈ సందర్భంగా తహసీల్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ 2014లో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 12,71,000 కుటుంబాలకు రూ.11,130 కోట్లు అందించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వీటితో పాటు, తులం బంగారం ఇస్తామని చెప్పి మాటతప్పారని పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ బీఫాంపై గెలిచి తన స్వలాభం కోసం పార్టీ మారారన్నారు.
జగిత్యాలరూరల్: జిల్లాలోని అన్ని గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్డీఏ పీడీ రఘువరణ్ అన్నారు. మంగళవారం జగిత్యాల రూరల్ మండలం చెర్లపల్లి గ్రామంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ పరిధిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై అవగాహన కల్పించడంతో పాటు, గ్రామాల్లోని అన్ని వార్డులు పరిశుభ్రంగా ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించాలన్నారు.


