గాంధీజీకి నివాళి అర్పిస్తున్న కలెక్టర్ సత్యప్రసాద్, సిబ్బంది
నివాళి అర్పిస్తున్న ఎస్పీ అశోక్‌కుమార్
నివాళి అర్పిస్తున్న బల్దియా చైర్‌పర్సన్ వాణి, డీసీసీ అధ్యక్షుడు నందయ్య
జగిత్యాల/జగిత్యాలక్రైం: జిల్లావ్యాప్తంగా శుక్రవారం గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. మహాత్ముడి చిత్రపటం, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రపంచానికే అహింస, సత్యగ్రహ సిద్ధాంతాలను అందించిన మహనీయుడు గాంధీ అని కలెక్టర్ సత్యప్రసాద్ కొనియాడారు. కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ రాజాగౌడ్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అహింసతో స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహాత్ముడు గాంధీజీ అని ఎస్పీ అశోక్ కుమార్ కొనియాడారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఎస్బీ సీఐ ఆరీఫ్ అలీఖాన్, ఆర్‌ఐలు వేణు, సైదులు పాల్గొన్నారు. మహాత్మగాంధీ ఆశయాలకు అనుగుణంగా జగిత్యాలను ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి అన్నారు. పురాణిపేట, మంచినీళ్ల బావి, గాంధీనగర్‌లో ఉన్న మహాత్మగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, కమిషనర్ సత్యప్రణవ్, గట్టు సతీశ్, ఆవారి పవిత్ర, బడుగు పద్మ, అల్లాల సరిత, పంబాల సుజాత, స్వప్న, లావణ్య పాల్గొన్నారు.


