ఎస్సారెస్పీకి 3,935 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో | - | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీకి 3,935 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Sep 13 2026 11:57 PM | Updated on Sep 13 2026 11:57 PM

జగిత్యాలఅగ్రికల్చర్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం వరకు 3,935 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. అలాగే 1892 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 1080.50 అడుగులు 46.355 టీఎంసీలుగా ఉంది.

జాతీయ స్థాయి యోగా పోటీలకు గురుకులం విద్యార్థిని

మల్యాల: మండలంలోని తాటిపల్లి బాలికల గురుకులం విద్యార్థిని కమలిని జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ మానస తెలిపారు. ఈనెల 11, 12న కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ కనబరిచిందని, రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానంలో నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందని పేర్కొన్నారు. అక్టోబర్‌ 3న రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనున్న పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. కమలినిని ప్రిన్సిపాల్‌తోపాటు పీఈటీ మధులిక అభినందించారు.

బీజేపీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్‌ సస్పెన్షన్‌

జగిత్యాలజోన్‌: బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు పార్టీ క్రమశిక్షణ కమిటీ కన్వీనర్‌ రవీందర్‌ విశ్వనాథ్‌ తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఓ అంగన్‌వాడీ టీచర్‌ పట్ల గంగాధర్‌ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు రాష్ట్ర కమిటీకి నివేదిక పంపించారు. పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యురాలు పూదరి అరుణ విచారణ చేపట్టి క్రమశిక్షణ కమిటీకి అందించారు. దీంతో వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని గంగాధర్‌కు నోటీసులు జారీ అయ్యాయి. అప్పటి వరకు గంగాధర్‌ను తాత్కలికంగా పార్టీ నుండి సస్పెండ్‌ చేస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. బాధితురాలిని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇటీవల ఫోన్‌లో పరామర్శించిన విషయం తెల్సిందే.

సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో జిల్లాకు కాంస్య పతకం

కరీంనగర్‌స్పోర్ట్స్‌: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన 11వ రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో జగిత్యాల జిల్లా బాలుర జట్టు తృతీయ స్థానం సాధించినట్లు సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి చెన్ను వెంకటేష్‌ తెలిపారు. ఆదివారం సిద్దిపేట జట్టుతో పోటీపడిన జగిత్యాల జట్టు 3–0 తేడాతో గెలుపొందినట్లు పేర్కొన్నారు. జిల్లా జట్టు విజయంపై కోచ్‌ గౌతమ్‌, పీడీలు ప్రశాంత్‌, రాజేశ్‌ హర్షం వ్యక్తం చేశారు.

రైతుల భూములతో కాంగ్రెస్‌ దందా

రాయికల్‌: 22ఏ పేరిట పట్టాలు ఉన్న రైతుల భూములపై కాంగ్రెస్‌ దందా చేస్తోందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. పట్టణంలో ఆదివారం ఆమె విలేకరులతో మా ట్లాడారు. రేవంత్‌ రెడ్డి అధికారంలోకొచ్చి మూ డేళ్లు గడుస్తున్నప్పటికీ హామీలు అమలు చేయ డం లేదని, దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదని విమర్శించారు. రైతుల భూములపై సీఎంతోపాటు మంత్రి పొంగులేటి కన్ను పడిందని, ఇద్దరు కలిసి 22ఏ కొత్త భూ దందాకు తెరలేపారని పేర్కొన్నారు. జగిత్యాల నియోజకవర్గంలోనే 16వేల ఎకరాల భూములను నిషేధిత భూమి కింద చేర్చారని తెలిపారు. ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ నడిపిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీకి దక్కిందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సస్పెండ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వెంట బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్‌, పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్‌, నాయకులు తురగ శ్రీధర్‌రెడ్డి, గోపి రాజిరెడ్డి, బత్తిని నాగరాజు, సత్యంగౌడ్‌, రమాపతిరావు, చాంద్‌పాషా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement