ఆధారం ఉంటేనే ఓటు | - | Sakshi
Sakshi News home page

ఆధారం ఉంటేనే ఓటు

Aug 28 2026 11:53 PM | Updated on Aug 28 2026 11:53 PM

జగిత్యాల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి గ్రామాల్లో సభలు నిర్వహిస్తున్నారు. మ్యాపింగ్‌ కాని అనామలిస్‌ జాబితాలో చేరిన ఓటర్లందరికీ నోటీసులు సైతం జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ నోటీసులపై విచారణ సైతం చేపడుతున్నారు. నోటీసులు అందుకున్న ప్రతిఒక్కరూ వారి వద్దనున్న ఆధారాలు చూపడంతో పాటు, డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 20 వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.

అర్హత గల ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు దక్కాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే సర్‌ ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీల నేతలతో అధికారులు సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఓటర్లకు నోటీసులు ఇవ్వడంతో పాటు, అనంతరం చేపట్టిన చర్యల గురించి ఖచ్చితంగా తెలియజేయాలని తెలిపారు. అర్హత గల ప్రతీ ఓటరుకు ఓటు హక్కు కల్పించడంతో పాటు, పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందించేందుకు అందరు సహకరించాలని పేర్కొంటున్నారు. నోటీసులు అందుకున్న వారు ఏఈఆర్వోలుగా ఉన్న తహసీల్దార్ల ఎదుట హాజరై వివరించుకోవాల్సి ఉంటుంది. 2002లో తమతో పాటు, తమ కుటుంబ పెద్దలకు సంబంధించిన ఓటు వివరాలు, ఆధారాలతో అధికారులకు చూపడంతో పాటు, అన్ని సక్రమంగా ఉన్నట్లయితే డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ఓటు హక్కు ఉంటుంది.

వార్డు సభల నిర్వహణ

సర్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా వార్డుసభలు, గ్రామసభలు నిర్వహించారు. అబ్‌సెంట్‌, షిఫ్ట్‌, డెత్‌ జాబితాను బీఎల్వోలు చదివి వినిపించారు. అలాగే సభలో ఫారం 6, 7, 8 అందుబాటులో ఉంచారు. అభ్యంతరాలుంటే వెంటనే దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. మరో ప్రక్రియ అయిన అనాలమసిస్‌ (ఓటర్ల వివరాలలో లోపం) మ్యాపింగ్‌ కాని, పాత, ప్రస్తుత రికార్డుల్లో లేని వారి వివరాలను సేకరిస్తున్నారు. అన్ని సక్రమంగా ఉంటేనే ఓటు హక్కు లభిస్తుంది. ఎన్నికల సంఘం చూపమన్న 12 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపితే వారికి ఓటు హక్కు దక్కుతుంది. లేనిచో ఓటు పోయే అవకాశాలు సైతం ఉంటాయి. అనామలసిస్‌లో ఉన్న వారికి పుట్టిన తేదీలో తప్పులు, కుటుంబ సభ్యుల మధ్య వయస్సుకు సంబంధించిన అసాదారణ వ్యత్యాసాలు, ఇంగ్లీష్‌, తెలుగు అనువాదాలలో పేర్లు మారడం వంటి లోపాలను సవరించుకోవచ్చు. ఓట్ల వివరాలను ప్రజలకు ముందుగానే తెలియజేయాలన్న ఉద్దేశంతో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మండలం పీఎస్‌లు మ్యాపింగ్‌ కానివి అనామలిస్‌

జగిత్యాల అర్బన్‌ 100 9,928 20,057 జగిత్యాలరూరల్‌ 58 5,681 12,321 బీర్‌పూర్‌ 23 827 4,221 రాయికల్‌ 61 2,115 11,203 సారంగాపూర్‌ 23 585 3,543 కోరుట్ల 91 3,945 18,717 ఇబ్రహీంపట్నం 37 833 7,523 మల్లాపూర్‌ 50 832 9,747 మెట్‌పల్లి 90 6243 21,302 ధర్మపురి 57 4578 9,996 బుగ్గారం 21 92 3,317 ధర్మారం 53 1746 8,136 ఎండపల్లి 28 1258 4,157 గొల్లపల్లి 44 555 7,200 పెగడపల్లి 43 691 5,737 వెల్గటూర్‌ 27 774 4,532

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement