బస్సు ఆపి.. రాఖీ కట్టి.. | - | Sakshi
Sakshi News home page

బస్సు ఆపి.. రాఖీ కట్టి..

Aug 28 2026 11:47 PM | Updated on Aug 28 2026 11:47 PM

● రాఖీ కట్టి ఆప్యాయత చాటిన సోదరీమణులు రాఖీ వేడుకల్లో మాజీ మావోయిస్టు నేత

బస్సులోనే తమ్ముడికి రాఖీ కడుతున్న అక్క

బస్సులోనే తమ్ముడికి రాఖీ కడుతున్న అక్క

తిమ్మాపూర్‌/ధర్మారం: రాఖీ అంటేనే ఆప్యాయత, అనుబంధాలకు నిరద్శనం. శుక్రవారం రాఖీ పండుగ నేపథ్యంలో పండుగ గొప్పతనాన్ని చాటిన అపురూప ఘటన కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలో చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మెండ రాజు అక్కడి డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పండక్కి సెలవు దొరకకపోవడంతో శుక్రవారం డ్యూటీలో ఉన్నాడు. తమ్ముడికి రాఖీ కట్టాలనుకున్న కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం రేణికుంటలో ఉంటున్న ఆయన సోదరి తమ్మనవేణి స్వప్న గోదావరిఖని నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సును రేణికుంటలో ఆపింది. తమ్ముడికి రాఖీ కట్టి మిఠాయి తినిపించింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన గంగాధర మహేందర్‌ ఆర్టీసీ డ్రైవర్‌. తన సోదరి సవిత శుక్రవారం రాఖీ కట్టేందుకు వచ్చింది. అప్పటికే మహేందర్‌ విధులకు వెళ్లాడు. ధర్మారం వద్ద ఉన్నా అని ఫోన్‌ చేయడంతో బస్టాండ్‌కు చేరుకుని రాఖీ కట్టింది.

కోరుట్ల: మావోయిస్టు మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ శుక్రవారం కోరుట్లలో రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతి స్నేహితుని కూతురు బెజ్జారపు జాహ్నవి తిరుపతికి రాఖీ కట్టింది. ఈ సందర్బంగా తిరుపతి మాట్లాడుతూ చిన్నప్పుడెప్పుడో రాఖీ కట్టుకున్నాని చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రాఖీ పండగ వేడుకల్లో పాల్గొనటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement