మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం

Aug 28 2026 11:47 PM | Updated on Aug 28 2026 11:47 PM

వెల్గటూర్‌: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర సంక్షేమ మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. వెల్గటూర్‌ మండలం సంకెనపెల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. గ్రామ పంచాయతీ భవనాలు ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు గ్రామ పాలనను సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ తిరుపతి, సర్పంచ్‌ కొదురుపాక పూజ, కాంగ్రెస్‌ నాయకుడు మద్దుల గోపాల్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలి

కథలాపూర్‌/మేడిపల్లి: రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం వేములవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎంపీడీవోలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రెండో దశ నియోజకవర్గానికి 2 వేలు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా లబ్దిదారులను ఎంపిక చేయాలని సూచించారు. 16వ ఆర్థిక సంఘం నిధులపై సమీక్షించారు. సమావేశంలో ఎంపీడీవోలు శంకర్‌, అంజుమ, నీరజ పాల్గొన్నారు.

ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

జగిత్యాలరూరల్‌: ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్‌ మండలం లక్ష్మీపూర్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణలో పాల్గొని మాట్లాడారు. ప్రతీ మనిషికి దైవంతో పాటు, భక్తిభావం ఉండాలన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచులు నల్ల కవిత, శీలం సురేందర్‌, పొనిశెట్టి మహేశ్‌, నాయకులు నల్ల స్వామిరెడ్డి, రాజశేఖర్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

గిరిప్రదక్షిణలో మాజీ జెడ్పీచైర్‌పర్సన్‌

శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన గిరి ప్రదక్షిణలో మాజీ జెడ్పీచైర్‌పర్సన్‌ దావ వసంత దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement