వెంకన్న స్వామికి గరుడ సేవ | - | Sakshi
Sakshi News home page

వెంకన్న స్వామికి గరుడ సేవ

Aug 28 2026 11:47 PM | Updated on Aug 28 2026 11:47 PM

ధర్మపురిలో మంత్రి అడ్లూరికి రాఖీ కడుతున్న నాయకురాలు

ఎమ్మెల్యే సంజయ్‌కు రాఖీ కడుతున్న సోదరి సమత

ఎంపీ అరవింద్‌కు రాఖీ కడుతున్న శ్రావణి

మాజీ మంత్రి జీవన్‌ రెడ్డికి రాఖీ కడుతున్న మహిళలు

అన్నాచెల్లెళ్ల పవిత్ర బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ వేడుకలను శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. రక్త సంబంధాన్ని మించిన పేగుబంధానికి నిదర్శనంగా సోదరీమణులు సోదరులకు రాఖీలు కట్టి,

నిండు మనసుతో దీవించారు. ధర్మపురిలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు కౌన్సిలర్లు, నాయకురాళ్లు, జగిత్యాలలో ఎంపీ అరవింద్‌కు భోగ శ్రావణితో పాటు మహిళలు రాఖీలు కట్టారు. కోరుట్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కు సోదరి సమత, జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి మహిళలు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల కాంతులు నింపాలని అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా పట్టణంలోని స్వీట్‌షాపులు, ఱాకీ దుకాణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. – జగిత్యాలటౌన్‌/కోరుట్ల/ధర్మపురి

ఘనంగా రక్షాబంధన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement