● ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాలక్రైం: జిల్లాలో ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదోతరగతి పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్ చట్టం అమలు చేస్తున్నట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. జిల్లాలో 68 పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు 163 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు గుంపుగా ఉండరాదని సూచించారు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు మైకులు, డీజేలతో ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించరాదన్నారు. పరిసరాల్లో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు మూసివేయాలని సూచించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా భద్రత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.


