జగిత్యాలటౌన్: అమెరికా సామ్రాజ్యవాదంతో ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంతో గల్ఫ్ కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయని, గ్యాస్ కొరత సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతుందని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఇందిరాభవన్‌లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వంటగ్యాస్ సబ్సిడీని ఎలాంటి అవాంతరాలు లేకుండా అందించి ఆడబిడ్డలకు అండగా నిలవాలని కోరారు. 2005లో కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధర రూ.250 నుంచి రూ.300 పెంచగా పెరిగిన రూ.50 భారాన్ని అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వమే భరించి ఆడబిడ్డలకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎయిర్‌బేస్‌లపై ఇరాన్ దాడి చేస్తుండడంతో ఆ ప్రభావం భారత్‌పై పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ కొరత రాకుండా చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో యుద్ధం ఆపాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేసి సమస్య తీవ్రతను ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పీసీసీ కార్యదర్శి బండ శంకర్, నాయకులు గాజుల రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, పుప్పాల అశోక్, చందా రాధాకిషన్, రఘువీర్‌గౌడ్, గుండ మధు, ముఖేశ్‌ఖన్నా, వేణురావు పాల్గొన్నారు.


