అడ్డగోలు ఖర్చుపై రసాభాస | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలు ఖర్చుపై రసాభాస

Mar 14 2026 7:54 AM | Updated on Mar 14 2026 7:54 AM

కోరుట్ల: కోరుట్ల మున్సిపల్‌ బడ్జెట్‌, సర్వసభ్య సమావేశం చైర్‌పర్సన్‌ తిరుమల వసంత ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గానూ సుమారు రూ.55.54 కోట్ల వ్యయంతో బడ్జెట్‌కు కౌన్సిల్‌ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ ఏడాది క్యాపిటల్‌ గ్రాంట్స్‌ రూ.38 కోట్లు, జనరల్‌ ఫండ్‌ ఆదాయం రూ.16 కోట్లుగా అంచనా చూపారు. బడ్జెట్‌ సమావేశంపై తమకు సరైన సమయంలో సమాచారం ఇవ్వకపోవడంపై కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికై న కౌన్సిలర్లకు బడ్జెట్‌పై అవగాహన లేదని, వారికి సరైన సమయం ఇవ్వకుండా ఆదరాబాదరగా బడ్జెట్‌ సమావేశం ఏర్పాటును నిరసిస్తూ కౌన్సిలర్లు గడ్డమీద పవన్‌ మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ అన్నం లావణ్య, యాటం పద్మ, రహీం, తోట గంగాధర్‌ కౌన్సిల్‌ సమావేశం నుంచి బాయ్‌కాట్‌ చేశారు.

34 అంశాలకు ఆమోదం

సమావేశంలో మొత్తం 35 అంశాలకు గాను 34 అంశాలకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. బడ్జెట్‌ మీటింగ్‌ సమాచార లోపం, మహిళా దినోత్సవం, 2 కే రన్‌కు అడ్డగోలు ఖర్చులు పెట్టడం సరికాదని కౌన్సిలర్‌ గడ్డమీద పవన్‌ శ్రీసాక్షిశ్రీ పత్రికను ఎత్తిచూపుతూ నిరసన వ్యక్తం చేశారు. చైర్‌పర్సన్‌ చాంబర్‌ ఫర్నిచర్‌ కోసం రూ.5 లక్షల ఖర్చు ఎందుకని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ వసీం ప్రశ్నించగా, చాంబర్‌తో అధికారుల గదుల్లోనూ ఫర్నిచర్‌ మార్పునకు ప్రతిపాదన ఉందని 14వ వార్డు కౌన్సిలర్‌ రెంజర్ల కల్యాణి సర్దిచెప్పారు. ఒకే వార్డుకు రూ.3.50 లక్షలు ఎలా ఇచ్చారని కౌన్సిలర్‌ సోగ్రాబీ, టేకుల శిరీష, జాల మాధవి అధికారులను నిలదీశారు. కౌన్సిలర్‌ సోగ్రాబీ స్టేజీ వద్ద భైఠాయించి నిరసన తెలుపగా, అన్ని వార్డుల్లోనూ సుమారు రూ.4 లక్షల నిధులు కేటాయించారు. ట్యాంక్‌బండ్‌లో రూ.10 లక్షలు వెచ్చించి బోటింగ్‌ ప్రతిపాదించగా సభ్యులు తిరస్కరించారు. కౌన్సిలర్‌ ఇందూరి తిరుమలవాసు మాట్లాడుతూ, మున్సిపల్‌ తరఫున ఒకే వర్గం పండుగ కాకుండా అన్నివర్గాలకు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. పాత్రికేయులను సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదని కౌన్సిలర్‌ సోగ్రాబీ నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షాహిద్‌, కౌన్సిలర్లు మేడిపల్లి శిరీష, తెడ్లు శ్రీజ, పుప్పాల ఉమాదేవి, కమిషనర్‌ రవీందర్‌, డీఈ సురేశ్‌ పాల్గొన్నారు.

నిలదీసిన కౌన్సిల్‌ సభ్యులు

ముందస్తు సమాచారం లేదని..

ఐదుగురు కౌన్సిలర్ల బాయ్‌కాట్‌

చివరికి రూ.55 కోట్ల బడ్జెట్‌ ఆమోదం

దుబారా ఖర్చులపై ‘సాక్షి’ కథనం ప్రదర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement