రాయికల్: సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ముందస్తు చర్యగా 13 ఏళ్ల వయసున్న బాలికలందరికీ తప్పనిసరిగా హెచ్‌పీవీ టీకాలు వేయించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నా రు. శనివారం రాయికల్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించి, టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. భవిష్యత్తులో బాలికలు ప్రా ణాంతక సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ఈ వ్యాక్సిన్ ఎంతో రక్షణ కల్పిస్తుందన్నారు. కోరుట్ల, మెట్‌పల్లి, రాయిక ల్, ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు జగిత్యాల మాతా శిశు ఆసుపత్రిలో ఈ హెచ్‌పీవీ టీకాలను ఉచితంగా వేస్తున్నట్లు తెలిపా రు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాయికల్ సీహెచ్‌సీ వైద్యాధికారి శ్రీకాంత్, ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్, డీఈవో పవన్ కుమార్, ఏఎన్‌ఎంలు, స్టాఫ్ నర్సులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
జేఎన్టీయూలో ముగిసిన శిక్షణ
కొడిమ్యాల: మండలంలోని జేఎన్టీయూ (నాచుపల్లి)లో మూడురోజులపాటు నిర్వహించిన ‘సి డేటా స్ట్రక్చర్స్’ ప్రోగ్రామింగ్ స్కిల్స్ శిక్షణ శనివారం ముగిసింది. ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీస్, టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ముగింపులో ప్రిన్సిపాల్ నర్సింహా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు అకడమిక్ చదువులతోపాటు నైపుణ్యాభివృద్ధిని పెంచుకోవాలన్నారు. విద్యార్థులకు మూడు రోజులపా టు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ద్వారా ప్రోగ్రామింగ్ నైపుణ్యాలపై రమేశ్ శిక్షణ ఇచ్చారు. టెక్నికల్ ఇంటర్వ్యూలలో డేటా స్ట్రక్చర్స్ ప్రాధాన్యాన్ని వివరించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ప్లేస్‌మెంట్ కో–ఆర్డినేటర్లు , వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శిక్షణతో సాంకేతిక నైపుణ్యాలపై ఆత్మవిశ్వాసం పెరిగిందని విద్యార్థులు తెలిపారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి
జగిత్యాలటౌన్: వేద ఆశీర్వచనం చేసిన బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని అఖిల బ్రాహ్మణ సేవాసంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. సామేల్ వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం స్థానిక తహసీల్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఆయన చిత్రపటాన్ని దహనం చేశారు. గాంధీభవన్‌లో ఈనెల 12న కవ్వంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం సందర్భంగా బ్రాహ్మణులు వేద ఆశీర్వచనం చేశారని, ఎమ్మెల్యే సామేల్ మాత్రం బ్రాహ్మణులపై పరుష పదజాలంతో మాట్లాడారని, ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పదవి ఉందని నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఆదిజాంబవ పరియోజన ప్రాంత ప్రముఖ్ అలగుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీ సీ గ్రూపునకు చెందిన సామేల్ ఎస్సీ సర్టిఫికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందారని ఆరోపించారు. బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మోతె ఉమాకాంత్‌శర్మ, నాయకులు సిరిసిల్ల రాజేందర్‌శర్మ, మేడిపెల్లి శ్రీనివాస్‌శర్మ, నేరెళ్ల శ్రీనివాసాచారి, మెట్ట కిరణ్‌భాస్కర్, కొత్తపల్లి శ్రీనివాస్, సిరిసిల్ల వేణుగోపాల్ పాల్గొన్నారు.


