జీవన్‌రెడ్డి పయనమెటో..? | - | Sakshi
Sakshi News home page

జీవన్‌రెడ్డి పయనమెటో..?

Mar 15 2026 5:01 AM | Updated on Mar 15 2026 5:01 AM

● పార్టీ మారుతున్నట్లు సోషల్‌ మీడియాలో వదంతులు ● అదేమీలేదంటున్న మాజీమంత్రి

జగిత్యాల: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు జీవన్‌రెడ్డి పయనమెటో తెలియని పరిస్థితి నెలకొంది. ఆయన పార్టీ మారబోతున్నట్లు సోషల్‌ మీడియాలో వదంతులు వస్తున్నాయి. అయినప్పటికీ ఈ విషయాలను జీవన్‌రెడ్డి కొట్టిపడేస్తున్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌లో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా కాంగ్రెస్‌ నుంచి ఒకేఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వ విధానాలపై పోరాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో జీవన్‌రెడ్డి జగిత్యాల నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి సంజయ్‌కుమార్‌పై ఓడిపోయారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన సంజయ్‌కుమార్‌ అభివృద్ధి కో సం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానంటూ కాంగ్రెస్‌ వైపు ఉంటున్నారు. ఇది రుచించని జీవన్‌రెడ్డి మొదటి నుంచి సంజయ్‌ విధానాలను బహిరంగంగా నే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీంతో జగిత్యాలలో కాంగ్రెస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌గా మారింది. ఇటీవలి మున్సిపల్‌ ఎన్నికల్లో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి వెళ్లాయి. జగిత్యాల మున్సిపాలిటీలో 50 స్థానాలు, రాయికల్‌లో 12స్థానాలకు సంబంధించిన బీఫాంలలో ఎక్కువగా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు ప్రా ధాన్యం ఇచ్చారు. ఆ సమయంలో జీవన్‌రెడ్డి జగిత్యాలలో అతని అనుచరవర్గాలను ఇండిపెండెంట్‌గా నిలబెట్టి దాదాపు 16 మందిని గెలిపించుకున్నారు. అధిష్టానం ఇద్దరినీ పిలిచి ఎవరికి చైర్‌పర్సన్‌ ఇచ్చినా ఒప్పుకోవాలని నిర్ణయించింది. జీవన్‌రెడ్డి మాత్రం మొదటి నుంచి కాంగ్రెస్‌ జెండా పట్టిన వారికే పీఠం ఇవ్వాలని పట్టుబట్టారు. అయినప్పటికీ ఎమ్మెల్యే వర్గానికి చెందిన సమిండ్ల వాణికే చైర్‌పర్సన్‌ పదవి కేటాయించారు. అప్పటినుంచి జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగే పరిస్థితి లేదని బహిరంగంగానే చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీని వీడుతున్నట్లు పుకార్లు వె ల్లువెత్తుతున్నాయి. జీవన్‌రెడ్డి స్వయంగా అనడంతో ఈ పుకార్లకు బలం చేకూరుతోంది. సో షల్‌ మీడియాతోపాటు కొన్ని చానళ్లలో బీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారని, ఈనెల 25న రాజీనామా చేస్తారని ప్రసారం కావడం చర్చకు దారితీస్తోంది. దీనిపై జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. అలాంటిదేమీ లేదని కొట్టిపడేస్తున్నారు. ఏదైనా ఉంటే నాయకులు, కార్యకర్తలతో చర్చించిన అనంతరమే నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement