కథలాపూర్(వేములవాడ): మండలంలోని తుర్తి అటవీప్రాంతంలో పులి సంచరించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. మొన్నటివరకు పులి నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్ శివారులో రాళ్లవాగు ప్రాజెక్టు ప్రాంతంలో సంచరించిందని, అక్కడి నుంచి కథలాపూర్ మండలం వైపు వచ్చినట్లు తెలిపారు. సూరమ్మ ప్రాజెక్టు ప్రాంతం నుంచి తుర్తి అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు పులి పాదముద్రల ఆధారంగా గుర్తించామన్నారు. రైతులు, మేకల కాపరులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పు లి ఎటువైపు వెళ్లిందో గుర్తిస్తామని మెట్‌పల్లి ఎఫ్‌ఆర్‌వో పద్మారావు, వేములవాడ ఎఫ్‌ఆర్‌వో ఖలీలొద్దిన్, సెక్షన్ ఆఫీసర్ ఎండీ.ముస్తాక్ ఆలీ, బీట్ ఆఫీసర్లు శ్రావణ్, సాయిరాం తెలిపారు.


