● చైర్మన్ మైలారపు లింబాద్రి
మెట్‌పల్లి: మెట్‌పల్లి మున్సిపాలిటీని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని చైర్మన్ మైలారపు లింబాద్రి అన్నారు. పట్టణంలోని 1, 11వార్డుల్లో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో చైర్మన్ పాల్గొన్నారు. ఒకటో వార్డులోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కౌన్సిలర్లు, సిబ్బందితో కలిసి పిచ్చిమొక్కలు, చెత్తను తొలగించారు. వెంకట్రావ్‌పేటలో పారిశుధ్య పనులు పరిశీలించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలన్నారు. వైస్‌చైర్మన్ ఓంకార్ నవీన్, కౌన్సిలర్లు రెబ్బాస్ మహేశ్, అజీం, బత్తుల నరేష్, దొనికెల శిరీష, నునుగొండ నరేష్, పందిరి రమేశ్, మాసుల ప్రవీణ్ తదితరులున్నారు.
మెరుగైన వైద్యం అందించాలి
కథలాపూర్: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎంహెచ్‌వో సుజాత అన్నారు. 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో గురువారం మెగా ఉచిత వైద్యశిబిరం ప్రారంభించారు. ప్రత్యేక వైద్య నిపుణులు 194 మందికి చికిత్స అందించారు. వీరిలో 28 మందిని మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి పంపించినట్లు తెలిపారు. ప్రజలు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీడీవో శంకర్, వైద్యాధికారులు సింధూజ, రజిత, సీహెచ్‌వో వేణు, సర్పంచ్ శేఖర్, ఉపసర్పంచ్ ప్రసాద్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
కొండగట్టులో కేంద్ర గణాంక శాఖ అధికారుల పూజలు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని కేంద్ర గణాంక శాఖ అధికారులు గురువారం దర్శించుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర సునీత, జాతీయ గణాంక ఉప ప్రాంతీయ కార్యాలయం అధికారి డి.వర్మ, గోవర్ధన శ్రీని వాస్ ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారి కి స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందించారు.
బల్దియాలో పారిశుధ్యానికి ప్రాధాన్యం
రాయికల్: రాయికల్ బల్దియాలో పారిశుధ్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ కట్కం రవి అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పాతబస్టాండ్‌లో గురువారం పారిశుధ్య సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. పారిశుధ్యంతోనే పట్టణంలో రోగాల నియంత్రణ చేపట్టవచ్చని తెలిపారు. వైస్ చైర్మన్ తురగ సౌజన్య, మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు పాల్గొన్నారు.


