
తండాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
జగిత్యాల: గిరిజన గ్రామాలు, తండాల్లో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం గిరిజన అభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష స మావేశం నిర్వహించారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రెయినేజీలు, పాఠశాల భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, కమ్యునిటీ భవనాలు, వాటర్‌ట్యాంక్‌లు అవసరమైన చోట్ల గుర్తించి అంచనాలు తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత, గిరిజనాభివృద్ధి అధికారి రాజ్‌కుమార్, టీపీవో మదన్, లక్ష్మణ్‌రావు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
మౌలిక వసతులకు ప్రత్యేక కార్యాచరణ
ధర్మపురి: గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని క లెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని గిరిజన గ్రామాలైన బోదరగూడెం, నక్కల చెరువుగూడెం, ఆకసాయిపల్లె తండాలను సోమవారం సందర్శించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన పనులు గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పీఆర్ ఈఈ లక్ష్మణ్‌రావు, డీఈఈ గో పాల్, ఏఈ మహేందర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రవీందర్, కార్యదర్ళులు ఉన్నారు.