శునకాల్లో ‘నియంత్రణ’ అంతంతే
● వీధి కుక్కలను పట్టుకోవడానికి ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసుకోవాలి. వాటికి స్టెరిలైజేషన్ చేయడానికి యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను నెలకొల్పాలి.
● కుక్కలకు సంబంధించిన ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలి.
● ప్రతి పట్టణంలో తప్పనిసరిగా వంద శాతం స్టెరిలైజేషన్ ప్రక్రియను చేపట్టాలి.
● మాంసాహార విక్రయ దుకాణాలు, హోటళ్లు తదితర వాటి వద్ద మిగిలిన మాంసపు వ్యర్థాలను పడేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
● కుక్కలు ఎదురుపడినప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై కరపత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి.
● వీధి కుక్కలు అధికంగా ఉన్న కాలనీలు, కుక్కకాట్లు ఎక్కువగా చోటు చేసుకుంటున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ అవసరమైన చర్యలు చేపట్టాలి.
● స్టెరిలైజేషన్ కోసం మెట్‌పల్లి పట్టణంలోని 7వార్డులో సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో కొన్ని రోజుల పాటు ఆపరేషన్లు నిర్వహించారు. ఆ తర్వాత స్థానికుల అభ్యంతరంతో దానిని కోరుట్ల శివారుకు తరలించారు. మొత్తం మీద రెండింటిలో 180 కుక్కలకు చికిత్స చేశారు.
● సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుట్లకు కుక్కలను తరలించడం ఇబ్బందిగా మారడంతో పదిరోజుల క్రితం ఆ సెంటర్‌ను మూసివేశారు.
● అప్పటి నుంచి స్టెరిలైజేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. వాస్తవానికి స్టెరిలైజేషన్ వల్ల కుక్కల్లో సంతానోత్పత్తి శాశ్వతంగా ఆగిపోతుంది. తద్వారా వాటి జనాభా తగ్గే అవకాశముంటుంది.
● దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం.. ఈ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టి వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించింది.
● కానీ అధికారులు దీని అమలుతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడం, ఇతర జాగ్రత్తలు చేపట్టే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మెట్‌పల్లిలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ మూసివేత విపరీతంగా పెరుగుతున్న వీధి కుక్కలు బయటకు వచ్చేందుకు భయపడుతున్న ప్రజలు
మెట్‌పల్లి: వీధి కుక్కల నియంత్రణకు చేపట్టిన స్టెరిలైజేషన్ (సంతాన నియంత్రణ ఆపరేషన్లు) ప్రక్రియను మెట్‌పల్లిలో నిలిపివేశారు. వీధి కుక్కలకు ఈ ఆపరేషన్లను వందశాతం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే స్థానిక అధికారులు మాత్రం నామమాత్రంగా నిర్వహించి వదిలేశారు. ఇప్పటికే కుక్కల బెడద తీవ్రంగా ఉండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రతినెలా వీటి దాడులతో పెద్ద సంఖ్యలో గాయాలపాలవుతున్నారు. అయినా అధికారులు స్టెరిలైజేషన్, ప్రభుత్వం సూచించిన మేరకు ఇతర అవగాహన, జాగ్రత్త చర్యలు చేపట్టే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
ఇవీ ప్రభుత్వ మార్గదర్శకాలు..
180తోనే నిలిపివేత
తొందరలోనే తిరిగి ప్రారంభిస్తాం
కోరుట్లలో ఉన్న సెంటర్‌ను మూసివేయడంతో ఆపరేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఆ సెంటర్‌ను మెట్‌పల్లి శివా రులో ఉన్న డంపింగ్ యార్డు వద్ద ఏర్పా టు చేస్తున్నాం. ఆ పనులు రెండు, మూడు రోజుల్లో పూర్తవుతాయి. ఆ తర్వాత స్టెరిలైజేషన్‌ను తిరిగి ప్రారంభిస్తాం.
– నాగేశ్వర్‌రావు, డీఈఈ