
ఐసీడీఎస్‌ను బలోపేతం చేయాలి
జగిత్యాలటౌన్: ప్రీప్రైమరీ, పీఎంశ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో బోధించి ఐసీడీఎస్‌ను బలోపేతం చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. హామీల అమలు, సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ అనుబంధం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందించారు. ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఈపి (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ)ని అమలు చేయాలని నిర్ణయించిందన్నారు. నాలుగేళ్ల పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లో చేర్చితే అంగన్వాడీల ఉనికి ప్రశ్నార్థకమవుతుందన్నారు. ముందుగా సురవరం సుధాకర్‌రెడ్డి మృతికి నివాళి అర్పించారు. నాయకులు టేకుమల్ల సమ్మయ్య, సాయిశ్వరి, ఏ.భాగ్యలక్ష్మి, సుతారి రాములు, మునుగూరి హన్మంతు, ఎండీ.ముక్రం తదితరులు పాల్గొన్నారు.