
వృద్ధుల సంరక్షణ వారసులదే..
రాయికల్: వృద్ధుల సంరక్షణ వారి వారసులదేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి తెలిపారు. ఆశ్రమాల్లో ఉన్న వృద్ధులకు న్యాయ సహాయం కోసం న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు. వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా రాయికల్ మండలం ఇటిక్యాలలో శని వారం నివేదిత వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. వృద్ధులకు చట్టాలపై అవగాహన కల్పించారు. వృద్ధాప్యం తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలిపెట్టడం సరికాదన్నారు. వృద్ధాశ్రమం, అ నాథ ఆశ్రమాల్లో వృద్ధులకు వారివారి వారసుల ద్వారా కలిగే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు వారానికోసారి న్యాయవాదులు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. వారసులు సంరక్షణలో నిర్లక్ష్యం చేస్తే స్థానిక తహసీల్దార్, ఆర్డీవోకు ఫిర్యాదు చేయాలని, సంరక్షణ ఖర్చులతోపాటు, వారసుల వద్దనున్న ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు ఉంటుందని గుర్తుచేశారు. లీగల్ సర్వీస్ హెల్ప్‌లైన్ నంబరు 15100కు ఏదైనా సమస్యలుంటే సంప్రదించాలని కోరారు. అనంతరం గ్రామంలోని సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు. జిల్లా న్యాయమూర్తులు నారాయణ, సీనియర్ సివిల్ జడ్జి న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ వెంకట మల్లిక్‌సుబ్రమణ్యశర్మ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, రెండో తరగతి న్యాయమూర్తులు గంప కరుణాకర్, ఏజీపీ ఓంప్రకాశ్, లీగల్, డిఫెన్స్ కౌన్సిల్ చంద్రమోహన్, సతీశ్, విజయ్, కృష్ణ, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ నరేశ్, తహసీల్దార్ ఉదయ్‌కుమార్, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, గంగారెడ్డి, ఆదిరెడ్డి, నీరటి శ్రీనివాస్, ఆశ్రమ నిర్వాహకులు భరత్‌రెడ్డి, మహిపాల్ పాల్గొన్నారు.
కేసుల రాజీతో ప్రశాంతంగా జీవితం
జగిత్యాలజోన్: కేసుల రాజీతో ప్రశాంత జీవి తాన్ని గడపవచ్చని న్యాయమూర్తి రత్నపద్మావతి అన్నారు. సెప్టెంబర్ 13న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారంపై పో లీసు అధికారులు, న్యాయవాదులతో సమావేశమయ్యారు. కోర్టు కేసులు, పోలీసుకేసులతో సా ధించేది ఏమీ లేదని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, న్యాయవాదులు పాల్గొన్నారు.