
లోక్ అదాలత్‌పై అవగాహన కల్పించాలి
జగిత్యాలక్రైం: వచ్చేనెల 13న నిర్వహించే జాతీ య మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వి నియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో శనివారం నేరసమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులపై పురోగతి సాధించాలన్నారు. కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని, అవసమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వ యంగా కలవాలని సూచించారు. దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్, నిఘా వ్యవస్థను పటిష్టపర్చాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు భద్రత ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి పొరపాట్లకూ తావు ఇవ్వొద్దని సూచించారు. డయల్ 100కు వచ్చే కాల్స్‌ను ప్రత్యేక శ్రద్ధతో పరిగణించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు పెంచాలని, అవసరమైన ప్రదేశాల్లో పికెట్ ఏర్పాటు చేయాలని తెలిపారు. శోభాయాత్రలో డీజేలకు అ నుమతి లేదన్నారు. నిబంధనలు విరుద్ధంగా ఏర్పా టు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. అనంతరం వివిధ కేసుల్లో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులను అభినందించారు. డీఎస్పీలు వెంకటరమణ, రఘుచంధర్, రాములు, వెంకటరమణ, సీఐలు శ్రీనివాస్, ఆరిఫ్‌అలీఖాన్, రఫీక్‌ఖాన్, శ్రీనివాస్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు కిరణ్‌కుమార్, వే ణు, సుధాకర్, కరుణాకర్, రాంనరసింహారెడ్డి, సురేశ్, అనిల్ కుమార్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.