జగిత్యాలరూరల్: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆకుకూరల సాగు చేపట్టాలని జిల్లా సంక్షేమాధికారి నరేశ్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వంజరిపల్లిలో ఉద్యానవన శాఖ అధికారి శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో సీడీపీవోలు, సూపర్‌వైజర్లకు నేల చదును, ఎరువుల తయారీ ఎలా చేయాలన్న దానిపై అవగాహన కల్పించారు. జిల్లాలోని 107 కేంద్రాల్లో పోషణ వాటికల ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయని, 1065 కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలకు ఇచ్చే ఒక్కపూట భోజనంలో పోషకాలు లభించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
నృసింహడికి వరదపాశం
సారంగాపూర్: బీర్‌పూర్‌లోని పెద్దగుట్ట ఉగ్ర నృసింహస్వామికి గురువారం వరదపాశం సమర్పించారు. వందలాది మంది భక్తులు, అర్చకులు ఉదయం 6 గంటలకు కాలినడకన పెద్ద గుట్టపైకి చేరుకుని ఉగ్రనృసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి కొండపైనుంచి వరదపాశం జారవిడిచారు. ఆలయ ప్రధాన అర్చకులు వొద్దిపర్తి పెద్ద సంతోష్, అర్చకులు చిన్న సంతోష్, మధుకుమార్ పాల్గొన్నారు.
గోవిందారం విద్యార్థులకు పతకాలు
మేడిపల్లి: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ 600 మీటర్ల పరుగు పందెంలో భీమారం మండలం గోవిందారం హైస్కూల్‌కు చెందిన బత్తుల రుచిత బంగారు, బూపతి అవంతిక వెండి పతకాలు సాధించారు. విద్యార్థినులను హెచ్‌ఎం అస్పాక్ హుస్సేన్, వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రశాంత్ అభినందించారు.
ఘనంగా మహాలింగార్చన
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీరామలింగేశ్వర స్వా మి ఆలయంలో గురువారం మహాలింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రుద్ర నమకం, మాన్యసూక్తం, లక్ష్మీసూక్తం, పురుషసూక్తం తదితర పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, వేదపండితులు ప్రవీణ్‌కుమార్‌శర్మ, మధు శంకర్‌శర్మ, సీనియర్ అసిస్టెంట్ అలువాలు శ్రీనివాస్ తదితరులున్నారు.
వరదకాలువను పరిశీలించిన అధికారులు
మల్యాల: మల్యాల మండలం రాంపూర్ వద్ద వరదకాలువను నీటిపారుదల శాఖ అధికారులు గురువారం పరిశీలించారు. వరదకాలువ సామర్థ్యం 22వేల క్యూసెక్కులు కాగా.. ప్రస్తుతం 20వేల క్యూసెక్కులు ప్రవహిస్తోందని, రైతులు, గొర్రెలకాపరులు వరదకాలువలోకి దిగవద్దని సూచించారు. కార్యక్రమంలో డీఈఈ తిరుపతి, ఏఈఈ వెంకటేశ్, అరుణ్‌కుమార్, వర్క్ ఇన్స్‌పెక్టర్ దాది మహేశ్ పాల్గొన్నారు.
అంగన్‌వాడీల్లో ఆకుకూరలు పండించాలి
అంగన్‌వాడీల్లో ఆకుకూరలు పండించాలి
అంగన్‌వాడీల్లో ఆకుకూరలు పండించాలి
అంగన్‌వాడీల్లో ఆకుకూరలు పండించాలి