
భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం: భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు జాప్యం చేయొద్దని అడిషనల్ కలెక్టర్ లత అధికారులకు సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం తనిఖీ చేశారు. భూ భారతి దరఖాస్తులను పరిశీలించారు. మండలంలో గ్రామసభల ద్వారా 1,463 మంది దరఖాస్తులు వచ్చాయని, 35 దరఖాస్తులను పరిష్కారం కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేశామని తెలిపా రు. అనంతరం గోదూర్‌లోని శ్రీరాజరాజేశ్వర రైస్‌మిల్లును సందర్శించారు. మిల్లింగ్ పనులను వేగవంతం చేసి బియ్యాన్ని త్వరగా అప్పగించాలన్నారు. ఆమె వెంట ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ వరప్రసాద్ పాల్గొన్నారు.
సివిల్ కోర్టుకు శాశ్వత భవనం కేటాయించండి
ధర్మపురి: ఽదర్మపురికి 2021లో జూనియర్ సివి ల్ కోర్టు మంజూరైంది. ప్రస్తుతం ఆ కోర్టును తాత్కాలి క భవనంలో కొనసాగిస్తున్నారు. కో ర్టుకు శాశ్వత భవనం కేటాయించాలని కోరు తూ బార్ కౌన్సిల్ సీని యర్ మెంబర్ కాసుగంటి లక్ష్మణ్‌కుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులు హైదరాబాద్‌లో హైకోర్టు పోర్ట్‌ఫోలియో జడ్జి యారా రేణుకను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు సమస్యను వివరించారు. భవన నిర్మాణానికి ఆమె సానుకూలంగా స్పందించినట్లు న్యాయవాదులు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అలుక వినోద్‌కుమార్, ప్రధాన కార్యదర్శి మామిడాల శ్రీ కాంత్‌కుమార్, న్యాయవాదులు జితేందర్, కస్తూరి శరత్ తదితరులున్నారు.
నేడు పెద్దగుట్ట నృసింహుడికి వరదపాశం
సారంగాపూర్: బీర్‌పూర్ మండలకేంద్రంలోని పెద్దగుట్టపై వెలసిన శ్రీలక్ష్మీనృసింహస్వామికి గురువారం వరదపాశం సమర్పిస్తున్నట్లు ఆలయ అర్చకులు వొద్ధిపర్తి పెద్దసంతోష్, చిన్న సంతోష్, మధుకుమార్ తెలిపారు. ఈ నెల 16నే జరగాల్సిన ఈ ఉత్సవాన్ని భారీ వర్షాలు, వరదల కారణంగా వాయిదా వేసిన విషయం తెల్సిందే. ఉదయం ఏడుగంటలకు కాలినడకన కొండకు బయల్దేరి.. మధ్యాహ్నం వరదపాశం సమర్పిస్తామని, భక్తులకు అన్నప్రసాదం ఉంటుందని అర్చకులు తెలిపారు.
‘ఉత్తమ ఉపాధ్యాయులుగా’ దరఖాస్తు చేసుకోండి
జగిత్యాల: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి అవార్డులకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రాము తెలిపారు. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, అర్హులైన ఉపాధ్యాయులు ఈనెల 25లోపు ఎంఈవో కార్యాలయాల్లో ఇవ్వాలని పేర్కొన్నారు. అంతకుముందు భగవాన్ శ్రీసత్యసాయిబాబా సేవ సంస్థ విద్యార్థులకు ఏటా నిర్వహించే వ్యాసరచన పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 10న అన్ని పాఠశాలల్లో నిర్వహించే ఈ పోటీల్లో విద్యార్థులు పాల్గొనాలని కోరారు.
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
జగిత్యాల: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. అబద్దపు హామీలు, అసత్యపు ప్రచారాలతో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. 60వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతు న్న ప్రభుత్వం.. విడుదల చేసిన నోటిఫికేషన్, పరీక్షలు, ఫలితాల వివరాలపై శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ దుస్థితి అధ్వానంగా మారిందని, కనీసం 20 నెలల కాలంలో ఒక్కసారి కూడా విద్యాశాఖపై సమీ క్షించలేదని మండిపడ్డారు. గురుకులం విద్యార్థులు ఫుడ్ పాయిజన్, పాముకాట్లతో మృతి చెందుతున్నారని తెలిపారు. ఆమె వెంట ఆనందరావు, మహిపాల్‌రెడ్డి, తిరుపతి, హరీశ్ పాల్గొన్నారు.

భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి

భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి