
రాజీవ్‌గాంధీ సేవలు మరవలేనివి
జగిత్యాల: రాజీవ్‌గాంధీ దేశం కోసం చేసిన సేవలు మరువలేనివని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. రాజీవ్ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఆయన తీసుకొచ్చిన కమ్యునికేషన్ వ్యవస్థతో ప్రస్తుతం దేశం అగ్రగామిగా ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులను అరికట్టడానికి చట్టాన్ని రూపొందించిన గొప్ప వ్యక్తి రాజీవ్ అని జీవన్‌రెడ్డి అన్నారు. రాజీవ్‌గాంధీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజ యలక్ష్మీ, బండ శంకర్, కొత్త మోహన్ పాల్గొన్నారు.
వచ్చేనెల 13న లోక్ అదాలత్
జగిత్యాలక్రైం: రాజీకి అనువైన కేసుల పరిష్కారానికి లోక్‌అదాలత్ దోహదపడుతుందని జిల్లా జడ్జి, న్యాయసేవ సంస్థ చైర్మన్ రత్న పద్మావతి తెలిపారు. వచ్చేనెల 13 నిర్వహించే లోక్ అదాలత్‌పై జిల్లా కోర్టులో సమీక్షించారు. లోక్ అదాలత్ విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇరుపక్షాల మధ్య పూర్వస్థితి ఏర్పడేలా చూడాలని, అవసరమైన సమాచారం అందించేలా న్యాయవాదులు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమం ద్వారా వందలాది కేసులు పరిష్కారం అవుతాయని, కక్షిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొదటి అదనపు జిల్లా జడ్జి నారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వాహకులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

రాజీవ్‌గాంధీ సేవలు మరవలేనివి