సమాన అవకాశాలు
అందరికీ విద్య .. సమాన అవకాశాలు ● అంతరాలు లేని సమాజం కావాలి.. ● అప్పుడే నంబర్‌వన్‌గా నిలుస్తాం
● జేఎన్‌టీయూ(నాచుపల్లి)లో ‘సాక్షి’ టాక్ షో ● అభిప్రాయాలు పంచుకున్న విద్యార్థులు స్వాతంత్య్ర లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. మహిళలు అర్ధరాత్రి భయంలేకుండా నడిరోడ్డుపై సురక్షితంగా వెళ్లినప్పుడే అది సాధ్యం. 150 కోట్ల జనాభా ఉన్న మనదేశం ప్రపంచలోని చిన్న దేశాలతోనూ ఒలంపిక్స్‌లో పోటీపడలేకపోతోంది. ప్రతిఒక్కరూ క్రీడల్లో రాణించాలి. ఇస్రో ప్రపంచంలోనే ఉపగ్రహ ప్రయోగాల విజయాలతో ముందువరుసలో ఉంది.
– కౌశిక్, ఈఈఈ, సెకండియర్
ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యనందించాలి. కుల, మతాలు మధ్య అంతరం లేని సమాజ నిర్మాణం కోసం చదువు ఒక్కటే మార్గం. ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు నేర్చుకునేందుకు అనువైన వాతావరణం కల్పించాలి. పట్టణాల్లోని వసతులు నిరుపేదల ముంగిటకు రావాలి. చదువుతోపాటు ఉపాధి కల్పన దిశగా విద్య సంస్కరణలు చేపట్టాలి.
– ప్రతీక్, ఈసీఈ, థర్డీయర్
ఆరోగ్యంతోనే సమాజాభివృద్ది సాధ్యం. శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్‌గా ధృడంగా ఉన్నప్పుడే సమస్యలు ఎదుర్కొనే శక్తి వస్తుంది. ప్రతికూల వాతావరణంలో నిబ్బరంగా నిలబడే ధైర్యం వస్తుంది. అనారోగ్యంతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ.. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలి. – శరణ్య, సీఎస్‌ఈ, సెకండియర్
ప్రకృతిని కాపాడుకుంటూ అభివృద్ధి వైపు పయనించాలి. భవిష్యత్‌తరాల భవిష్యత్ మన చేతుల్లోనే ఉంది. నదులను కలుషితం చేయకుండా.. ప్రకృతిని కాపాడుకోవాలి. పచ్చని చెట్లను నరికేస్తూ చేపట్టే అభివృద్ధితో భవిష్యత్ అంధకారం అవుతుంది. ప్రకృతిని కాపాడుతూనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి.
– శ్రుతి దయానంద్, ఈఈఈ, థర్డీయర్
ధనిక, నిరుపేద భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందాలి. పారదర్శకతతో కూడిన పాలన, అవినీతి లేని సమాజం రావాలి. హైదరాబాద్‌వంటి ప్రాంతాల్లోని వసతులు మారుమూల పల్లెల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలి. కుల, మతాల గోడలు బద్దలు కొట్టాలి. అందరూ సమానమనే సమాజం రావాలి.
– భానుశ్రీ, ఈఈఈ, థర్డీయర్
ఉదయం నిద్రలేవగానే కళ్ల ఎదుట పచ్చని చెట్లు దర్శనం ఇవ్వాలి. ప్రతి ఇల్లు పచ్చని చెట్లతో కళకళలాడాలి. నదుల్లోని నీరు కలుషితం కాకుండా తాగేందుకు అనువుగా ఉండాలి. దశాబ్దాల తరబడి అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి. కాలుష్యరహిత సమాజం కోసం మరో స్వాతంత్య్ర పోరాటం చేయాలి. – ప్రగతి, ఈఈఈ, థర్డీయర్ దేశంలోని యువత తమ శక్తిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వాలు అవకాశాలు కల్పించాలి. ప్రపంచ దేశాల జీడీపీలో దేశం 16శాతం వాటా సమకూర్చుతోంది. అత్యధికంగా మానవ వనరులు ఉన్న మన దేశం ప్రపంచంలో అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానంలో నిలిచేందుకు యువతలోని శక్తిని వెలికితీసి, సుస్థిరాభివృద్ధికి బాటలు వేయాలి.
– వినిత్ సీఎస్‌ఈ, థర్డీయర్
విద్య, వైద్యం, పరిశ్రమలు, ఉపాధి రంగాల్లో మౌలిక వసతులు కల్పించాలి. ప్రతి గ్రామంలో రికార్డులు డిజిటలైజేషన్ కావాలి. రేపటి సమాజం కోసం విద్యార్థులే సమాజ దిక్చూచీగా మారేందుకు వసతులు కల్పించాలి. మౌలిక వసతులు కల్పిస్తేనే సుస్ధిర అభివృద్ధి సాధ్యం.
– మనీషా సీఎస్‌ఈ, సెకండియర్
సుస్థిర అభివృద్ధి పేరిట భవిష్యత్ తరాలను నాశనం చేయవద్దు. పర్యావరణానికి హాని కలిగించే పాస్టిక్‌ను నిషేధించాలి. సేంద్రియ ఎరువులను అన్నదాతలకు ఉచితంగా అందించాల్సిన అవసరం ఉంది. రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు ప్రోత్సహించాలి. చెట్లను నరికివేయకుండా ప్రకృతిని కాపాడుతూ అభివృద్ధి వైపు పయనించాలి.
– సౌమ్య, సీఎస్‌ఈ, సెకండియర్
పట్టుదల, క్రమశిక్షణ గల కుటుంబం అభివృద్ధితో సమాజాభివృద్ది సాధ్యమవుతుంది. సృజనాత్మక ఆలోచనలు చేస్తూ.. సమాజాభివృద్ధికి పాటుపడాలి. మనదేశ అభివృద్ధికి నైపుణ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించాలి. చదువుతోపాటు సమాజ హితం కోసం పనిచేయాలి. ప్రకృతిని కాపాడేందుకు ప్రజలను చైతన్యవంతం చేయాలి.
– మనిష్, సీఎస్‌ఈ, ఐటీ,
అందరికీ విద్య ..
మల్యాల/కొడిమ్యాల: అంతరాలు లేని సమాజం కావాలి. కులమతాల బేధం లేకుండా అన్నివర్గాలకు నాణ్యమైన విద్య, వైద్యం అందాలి. సాంకేతికంగా స్వావలంబన సాధించేందుకు పరిశోధనలు పెరగాలి. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. స్వేచ్ఛ, సమానత్వ భావాలు విరజిల్లాలి. రాజ్యాంగంలోని హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు స్వేచ్ఛగా పొందాలి. దేశంలోని యువత శక్తిని సద్వినియోగం చేసుకుంటూ.. సుస్థిర అభివృద్ధికి బాటలు వేయాలి. కరోనావంటి మహమ్మారి మరోసారి వచ్చినా తట్టుకునే శక్తివంతమైన సమాజం నిర్మాణం కావాలి.. ఇవి భావిభారత పౌరుల మాటలు. ‘2047 నాటికి వందేళ్ల భారతదేశం’ అంశంపై కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ‘సాక్షి’ టాక్ షో నిర్వహించింది. ప్రిన్సిపాల్ విశ్వనాథన్ అధ్యక్షతన కొనసాగిన ఈ కార్యక్రమంలో దేశ అభివృద్ధిపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
స్వాతంత్య్ర లక్ష్యం నెరవేరాలి
నాణ్యమైన విద్య అందాలి
ఆరోగ్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యం
ప్రకృతిని కాపాడుకోవాలి
అంతరాలు లేని సమాజం
కాలుష్య రహిత సమాజం రావాలి
యువశక్తి పెరగాలి
మౌలిక వసతులు కల్పించాలి
ప్లాస్టిక్ నిషేధించాలి
కుటుంబం అభివృద్ధి చెందితేనే..
1/12
సమాన అవకాశాలు
2/12
సమాన అవకాశాలు
3/12
సమాన అవకాశాలు
4/12
సమాన అవకాశాలు
5/12
సమాన అవకాశాలు
6/12
సమాన అవకాశాలు
7/12
సమాన అవకాశాలు
8/12
సమాన అవకాశాలు
9/12
సమాన అవకాశాలు
10/12
సమాన అవకాశాలు
11/12
సమాన అవకాశాలు
12/12
సమాన అవకాశాలు