
ఎన్నికల నిర్వహణలో ఈసీదే ప్రధాన పాత్ర
జగిత్యాల: ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్‌దే ప్రధాన పాత్ర అని, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న ప్రధాని మోదీకి ప్రజలు గుణపాఠం చెబుతారని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. తహసీల్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొంగ ఓట్ల నమోదును బీజేపీ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, బీహార్‌లో 65 లక్షల ఓట్లను తొలగించారన్నారు. కాంగ్రెస్ అనుకూల ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ప్రజల విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్యంపై నమ్మకం సన్నగిల్లుతుందన్నారు.
కోర్టుల్లో మీడియేషన్ డ్రైవ్
జగిత్యాలజోన్: జిల్లాలోని అన్ని కోర్టుల్లో కేసుల మధ్య రాజీ కుదిర్చేందుకు మీడియేషన్ డ్రైవ్ (మధ్యవర్తిత్వం) నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి తెలిపారు. సెప్టెంబర్ 30వరకు కార్యక్రమం కొనసాగుతుందని, రాజీకి అనుకూలమైన క్రిమినల్, చెక్‌బౌన్స్, మోటార్ వాహనాలు, బ్యాంకు కేసులు, చిట్‌ఫండ్ కేసులను పరిష్కరిస్తామని వివరించారు.