
గోదావరి తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ధర్మపురి: గోదావరికి వరద పెరుగుతున్నందున తీరప్రాంత ప్రజలు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. గోదావరి ప్రవాహాన్ని గురువారం పరిశీలించారు. నదీ వద్ద ప్రస్తుతం నీటిమట్టం, ప్రవాహం, వేగం, సేఫ్టీ బారీకేడ్లు, రక్షణ చర్యలను పరిశీలించారు. భక్తులు నదిలోపలికి వెళ్లి స్నానాలు చేయొద్దని, సెల్ఫీలు దిగడం ప్రమాదకరమని అన్నారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్‌కుమార్, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, ఈవో శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు.
పెరిగిన గోదావరి ప్రవాహం
ధర్మపురి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు.. కడెం ప్రాజెక్టు నుంచి వదిలిన నీటితో ధర్మపురి వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. మంగలిగడ్డ పుష్కరఘాట్ నుంచి నీరు ప్రవహిస్తోంది.
సీపీఐ వందేళ్ల చరిత్ర పల్లెకు చేరాలి
కోరుట్లటౌన్: సీపీఐ వందేళ్ల చరిత్రను ప్రజలకు చేరవేయాలని ఆ పార్టీ జాతీయ నేత చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేని శంకర్ అన్నారు. కోరుట్లలోని సి.ప్రభాకర్‌భవన్ లో జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశాన్ని కార్యవర్గ సభ్యులు సుతారి రాములు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎర్ర జెండాలతో ప్రదర్శనలు చేపట్టాలన్నారు. ఈనెల 20 నుంచి 22వరకు మేడ్చల్ జిల్లాకేంద్రంలో రాష్ట్ర మహా సభలు ఉంటాయన్నారు.
పార్టీ జిల్లా కార్యదర్శిగా చెన్న విశ్వనాథం
పార్టీ జిల్లా కార్యదర్శిగా కోరుట్లకు చెందిన చెన్న విశ్వనాథం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనను చాడ శాలువతో సన్మానించారు. అలాగే సహాయ కార్యదర్శిగా ఇరుగురాల భూమేశ్వర్, కార్యవర్గసభ్యులుగా వెన్న సురేష్, సుతారి రాములు, ఎండీ.ముఖ్రం, హనుమంతు, కొక్కుల శాంత, ఎన్నం రాధ, మహేష్, భూమయ్య, ఎండి.ఉస్మాన్, అక్రమ్ మాలిక్, ప్రవీణ్, మౌలానా, రాజన్న ఎన్నికై నట్లు ప్రకటించారు.
జిల్లాకు మోస్తరు వర్ష సూచన
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాకు రానున్న ఐదురోజులు మోస్తరు వర్ష సూచన ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 30, రాత్రి ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.

గోదావరి తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

గోదావరి తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి