
పథకాలు పేదలకు అందించడమే లక్ష్యం
● కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
మల్లాపూర్: ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు చేరాలని, అర్హులకు అందేలా చూస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో లబ్ధిదారులకు గురువారం రేషన్‌కార్డు పత్రాలు పంపిణీ చేశారు. కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, రానివారు మీ సేవలో దరఖాస్తు చేసుకుని రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, కరెంట్ లేక నానా అవస్థలు పడ్డామని, పదేళ్ల కేసీఆర్ పాలనతో 24గంటల విద్యుత్‌తోపాటు సాగునీటి సమస్య తీరిపోయిందన్నారు. అదనపు కలెక్టర్ లత, మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ రమేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత, ప్యాక్స్ చైర్మన్లు బద్దం అంజిరెడ్డి, నేరళ్ల మోహన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో..
ఇబ్రహీంపట్నం: మండలకేంద్రంలో ఏర్పాటు చేసి న కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. పథకాలను ప్రజలు విని యోగించుకోవాలన్నారు. సివిల్ సప్లయ్ డీఎం జి తేందర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
పాలిటెక్నిక్ సందర్శన
కోరుట్ల: పట్టణ శివారులోని పాలిటెక్నిక్‌ను ఎమ్మెల్యే సంజయ్ సందర్శించారు. విద్యార్థులను గతేడాది హైదరాబాద్‌లోని టీహబ్ సందర్శనకు తీసుకెళ్లామని, ఈ ఏడాది ఆగస్టు 14న వందమంది విద్యార్థులను తీసుకెళ్తామని పేర్కొన్నారు. కళాశాల వద్ద బస్సులు నిలపడం లేదని విద్యార్థులు తెలపగా.. ఆర్‌ఎంతో మాట్లాడారు. బస్సు నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కళాశాల ప్రాంగణంలో పలువురు మద్యం సేవిస్తున్నారని తెలపగా ఎస్సైతో మాట్లాడారు. కళాశాల వరకు పెట్రోలింగ్ చేపట్టాలన్నారు. పిచ్చి మొక్కలు ఉండటంతో క్లీన్ చేయించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.