
పూర్వ వైభవం దిశగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు
జగిత్యాల: పునర్‌వైభవం దిశగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ముందుకెళ్తున్నాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సర్వతో ముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడారు సురేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలను సందర్శించారు. 2025–26 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అడ్మిషన్లు సాధించడంలో ప్రభంజనం సృష్టించాయని తెలిపా రు. ప్రతీ అధ్యాపకుడు విద్యార్థులకు ఎన్నో సేవలందించడం జరుగుతుందని, విద్యార్థుల సంఖ్య పెరగడమే దానికి నిదర్శనమన్నారు. అధ్యాపకుల సంఘం తరుఫున అడ్మిషన్లతో పాటు, కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఆడెపు శ్రీనివాస్, కరుణాకర్, తోట మహేశ్, కృష్ణారెడ్డి, పడాల తిరుపతి, గోవర్దన్, మధూకర్, సంగీతరాణి, సుజాత పాల్గొన్నారు.