ఆస్తిపన్ను పక్కదారి పట్టించిన ఉద్యోగిపై వేటు | - | Sakshi
Sakshi News home page

ఆస్తిపన్ను పక్కదారి పట్టించిన ఉద్యోగిపై వేటు

Aug 2 2025 6:34 AM | Updated on Aug 2 2025 6:34 AM

ఆస్తిపన్ను పక్కదారి  పట్టించిన ఉద్యోగిపై వేటు

ఆస్తిపన్ను పక్కదారి పట్టించిన ఉద్యోగిపై వేటు

జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో ఆస్తిప న్ను డబ్బులు పక్కదారి పట్టించిన ఉద్యోగిని సస్పెండ్‌ చేశారు. ఈ విషయమై కమిషనర్‌ స్పందనను అడుగగా.. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సొంతానికి వాడుకున్న బిల్‌కలెక్టర్‌ నర్సయ్యను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. ఆలస్యంగా ఆస్తిపన్నుకు సంబంధించిన డిపాజిట్‌ను మున్సి పల్‌ అకౌంట్‌లో జమచేయడంతో మెమో ఇచ్చామని, నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో సస్పెండ్‌ చేశామని అన్నారు.

తల్లిపాల వారోత్సవాలు నిర్వహించాలి

జగిత్యాల: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శా ఖ ఆధ్వర్యంలో ఈనెల 1నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సంక్షేమ అధికారి నరేశ్‌ అన్నారు. ప్రస్తుతకాలంలో తల్లిదండ్రులు బిడ్డకు సంరక్షణ అందించడంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారని, ప్రసవం అనంతరం పిల్లల సంరక్షణ ఎంతో ముఖ్యమైందని తెలిపారు. తల్లిపాల గురించి ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు.

ఓపెన్‌ స్కూల్‌కు దరఖాస్తుల గడువు పొడిగింపు

జగిత్యాల: ఓపెన్‌ స్కూల్‌కు 2025–26 సంవత్సరానికి ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్‌ ప్రవేశాల కోసం నిర్ణీత ఫీజుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 18 వరకు గడువు పొడిగించినట్లు డీఈవో రాము తెలిపారు. ఆలస్య రుసుముతో 19నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం అన్ని పత్రాలను విద్యాధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు

జగిత్యాలఅగ్రికల్చర్‌: ఉద్యోగులు అంకితభావ ంతో పనిచేస్తేనే సంస్థకు గుర్తింపు వస్తుందని డీఆర్‌డీఏ పీడీ రఘువరణ్‌ అన్నారు. జిల్లా గ్రా మీణాభివృద్ధి శాఖలో ఇటీవల బదిలీపై వచ్చిన ఏపీఎంలతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో అమలు చేస్తున్న బ్యాంకు లింకేజీ, మార్కెటింగ్‌, ఫామ్‌–నాన్‌ ఫామ్‌, సీ్త్రనిధి కార్యక్రమాలు, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలను విజయవంతం చే యాలని కోరారు. రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా ను ముందంజలో ఉంచేందుకు కృషిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కొత్తగా విధుల్లో చేరిన ఏపీఎంలు డీఆర్‌డీఏ పీడీ రఘువరణ్‌కు పుష్పగుచ్ఛం అందించారు. ఏపీడీ సునీత, డీపీఎంలు విజయభారతి, నాగేశ్వర్‌రావు, నారాయణ, పాల్గొన్నారు.

మహిళా కళాశాలలో ఏఐ అంతర్జాతీయ ఉచిత శిక్షణ

జగిత్యాల: ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థినులకు విద్యాశాఖ, హైదరాబాద్‌ ఏఐ స్కూల్‌ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ తెలిపారు. ఆగస్టు నుంచి ప్రారంభిస్తున్న శిక్షణను ఆన్‌లైన్‌లో మూడు నెలల పాటు కల్పిస్తారన్నారు. ఈ కోర్సుతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10 కళాశాలలు ఎంపిక చేయగా.. అందులో జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఉందని, ఇది మన అదృష్టమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement