
రాష్ట్రంలో గృహ నిర్మాణానికి ప్రాధాన్యం
● 4లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం ● మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాలరూరల్: రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా గృహ నిర్మాణ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మాణం చేపట్టేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 2025–26 సంవత్సరానికి 4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. దశాబ్దకాలంగా మంజూరు కాని రేషన్‌కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అర్హత ప్రాతిపాదికన మంజూరు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజంగి నందన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జున్ను రాజేందర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ శీలం సురేందర్, మాజీ ఎంపీపీ మహేశ్, నాయకులు శ్రీరాముల గంగాధర్, మంగళారపు మహిపాల్, సత్తిరెడ్డి, మన్మోహన్, వంశీ, శంకర్, మల్లారెడ్డి, తిరుపతిరావు పాల్గొన్నారు.