
మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం
● ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాలక్రైం: మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడుతాయని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మెగా వాలీవాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించి మాట్లాడారు. కొన్ని రోజులుగా పోలీస్‌స్టేషన్ సర్కిల్‌స్థాయిలో వాలీబాల్ టోర్నీ నిర్వహించామని, అందులో గెలుపొందిన వారిని జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. యువత తమ ఆలోచనలను సరైన దిశలో వినియోగించుకోవాలని, సామాజిక బాధ్యతతో ముందడుగు వేయాలన్నారు. ప్రతీ క్రీడాకారులు యాంటీడ్రగ్స్ వారియర్‌గా పనిచేసి డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడంలో కృషి చేయాలని సూచించారు. అనంతరం గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి తనవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ, సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటస్వామి, జగిత్యాల, మెట్‌పల్లి డీఎస్పీలు రఘుచందర్, రాములు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు కిరణ్‌కుమార్, వేణు, సైదులు, సీఐలు శ్రీనివాస్, ఆరీఫ్ అలీఖాన్, శ్రీనివాస్, కరుణాకర్, సుధాకర్, రాంనర్సింహారెడ్డి, సురేశ్, ఎస్సైలు అనిల్‌కుమార్, సదాకర్ పాల్గొన్నారు.