
వర్షాలు లేక కష్టంగానే ఉంది
ఈ సీజన్‌లో వర్షాలు కురువకపోవడం, కురిసిన ఒక్కటి, రెండు జల్లులకే పరిమితమవడంతో సాగు నీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నాలుగైదు రోజులు వర్షాలు పడకపోతే ఆరుతడి పంటలు వాలిపోతాయి. ప్రస్తుతం వ్యవసాయ బావుల్లో ఉన్న నీటితో పంటలు పండించుకునే పరిస్థితి ఏర్పడింది.
– రాజేందర్ రెడ్డి, చిట్టాపూర్, మల్లాపూర్(మం)
ఇంకా సమయం ఉంది
వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల వల్ల జూలైలో పెద్దగా వర్షాలు కురవలేదు. నైరుతీ రుతుపవనాలకు ఇంకా సమయం ఉంది కాబట్టి అగస్టులో వర్షం పడేందుకు అవకాశాలు ఉన్నాయి. రైతులు వర్షాల గురించి ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– డాక్టర్ హరీశ్‌కుమార్ శర్మ, వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్, పొలాస

వర్షాలు లేక కష్టంగానే ఉంది