సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మక మార్పు | - | Sakshi
Sakshi News home page

సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మక మార్పు

Aug 1 2025 11:46 AM | Updated on Aug 1 2025 11:46 AM

సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మక మార్పు

సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మక మార్పు

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

గొల్లపల్లి: సన్నబియ్యం పేదలకు అందించడం విప్లవాత్మక మార్పు అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. గొల్లపల్లి మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలానికి మంజూరైన 1,658 మంది లబ్ధిదారులకు రేషన్‌కార్డులు, 67 మందికి రూ.60 లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు, 55మందికి రూ.18.41 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. అర్హుందరికీ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్డులు రానివారు కంగారు పడొద్దని, ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. కొత్త పేర్లు చేర్చేందుకు అవకాశం కల్పించామన్నారు.

మల్లన్నపేటలో బస్సు సేవలు ప్రారంభం

మండలంలోని మల్లన్నపేటలో ఆర్టీసీ బస్సు సేవలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల అభీష్టం మేరకు బస్సును పునఃప్రారంభించామన్నారు. బస్సు మల్లన్నపేట, శంకర్‌రావుపేట, నందిపల్లి, లక్ష్మీపూర్‌ మీదుగా జగిత్యాల వెళ్తుందని, సేవలు వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి

లక్ష్మణ్‌కుమార్‌ విప్‌గా ఉన్నప్పుడు మండలకేంద్రంలో క్రీడాప్రాంగణం ఏర్పాటు చేయాలని వందమందికి పైగా యువత కోరారు. అప్పుడు మాట ఇచ్చిన అడ్లూరి మంత్రిగా సర్వేనంబరు 735లోని ఆరెకరాల స్థలాన్ని క్రీడామైదానానికి కేటాయిస్తూ.. ప్రొసీడింగ్‌కాపీ అందించారు. ప్రభుత్వ నిధులతో మైదానాన్ని తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఆర్డీవో మధుసూదన్‌, డీఎస్‌వో జితేందర్‌రెడ్డి, ఆర్టీసీ డీఎం కల్పన, తహసీల్దార్‌ వరందన్‌, ఎంపీడీవో రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ బీమ సంతోష్‌, వైస్‌ చైర్మన్‌ రాజిరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నిషాంత్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్‌ను అడ్డుకోవడం తగదు

మెట్‌పల్లి: బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని మంత్రి అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని, తాము 55వేల కుటుంబాలకు కార్డులను అందించామన్నారు. ధర్మపురి ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ జువ్వాడి కృష్ణారావు, నాయకులు ఉన్నారు.

పేదల సంక్షేమమే ధ్యేయం

బుగ్గారం: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అన్నారు. మండలంలోని పలువురు లబ్ధిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. మీ సేవా కేంద్రాల ద్వారా రేషన్‌కార్డుల సేవలు పొందవచ్చని తెలిపారు. 21 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు. బీసీ సంక్షేమ అధికారి సునీత, తహసీల్దార్‌ మాజిద్‌, ఎంపీడీవో అఫ్జల్‌మియా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement