రోగులకు మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

Aug 1 2025 11:46 AM | Updated on Aug 1 2025 11:46 AM

రోగుల

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

జగిత్యాలరూరల్‌: రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సూచించా రు. మండలంలోని కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఓపీ ఎంత అని చూశారు. ఆవరణలో పిచ్చిమొక్కలు తొలగించి శానిటేషన్‌ చేయించాలని అధికారులకు సూచించారు. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓపీ సేవలు, ల్యాబ్‌ రికార్డ్స్‌, మెడికల్‌ ఫార్మసీ రిజిస్టర్‌ పరిశీలించారు. వైద్యులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆర్డీవో మధుసూదన్‌, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌, వైద్యురాలు సౌజన్య, అధికారులు, సిబ్బంది ఉన్నారు.

పబ్లిక్‌ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

జగిత్యాల: హైదరాబాద్‌లోని బేగంపేట పబ్లిక్‌ స్కూల్‌లో 1, రామంతపూర్‌లో ఒకటో తరగతిలో ఒక సీటులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. దరఖాస్తులను ఈనెల 11న అందించాలన్నారు. ముందుగా అంగన్‌వాడీ, రెసిడెన్షియల్‌, గురుకులాలకు కోడిగుడ్ల సరఫరాకు టెండర్లు తెరిచారు.

సఖీ కేంద్రం సేవలు అభినందనీయం

జగిత్యాల: సఖీ కేంద్రం సేవలు అభినందనీయమని సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ మేజిస్ట్రేట్‌ సుబ్రహ్మణ్యశర్మ అన్నారు. జిల్లాకేంద్రంలోని సఖీ సెంటర్‌ను గురువారం తనిఖీ చేశారు. కౌన్సెలింగ్‌ అర్థమయ్యేలా ఇవ్వాలని, ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. లీగల్‌ కేసులపై అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అడ్మినిస్ట్రేటర్‌ లావణ్య పాల్గొన్నారు.

విద్యార్థులకు సరళమైన పద్ధతిలో బోధించాలి

డీఈవో రాము

జగిత్యాల: విద్యార్థులకు సరళమైన పద్ధతిలో బోధించాలని డీఈవో రాము అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాల్లో పాల్గొన్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యార్థుల సులభమైన పద్ధతిలో బోధిస్తేనే అర్థమవుతుందన్నారు. బాధ్యతగా తీసుకుని విద్యార్థులకు మంచి పునాది వేయాలన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారి రాజేశ్‌ పాల్గొన్నారు.

మన ఊరు – మన బడి బిల్లులు చెల్లించండి

జగిత్యాలటౌన్‌: మన ఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా చేసిన పనుల బిల్లులు రాక రెండేళ్లుగా ఇబ్బంది పడుతున్నామని, వాటిని చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్‌ చేశారు. పలువురు కాంట్రాక్టర్లు కలెక్టరేట్‌ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. పనుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వక్తం చేశారు. ధర్మపురి జెడ్పీహెచ్‌ఎస్‌లో పనులు చేసినా.. బిల్లులు రాక పాత అంజన్న అనే కాంట్రాక్టర్‌ తీవ్ర ఒత్తిడికి లోనై మరణించాడని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి ఈనెల 10లోపు బిల్లులు విడుదల చేయాలని, లేకుంటే 15న పాఠశాలలకు తాళాలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌ ఏవోకు వినతిపత్రం అందించారు.

రోగులకు మెరుగైన  వైద్యం అందించాలి1
1/3

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

రోగులకు మెరుగైన  వైద్యం అందించాలి2
2/3

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

రోగులకు మెరుగైన  వైద్యం అందించాలి3
3/3

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement