
యువకుడి వైద్యానికి రూ.1.52లక్షల విరాళం
● సామాజిక మిత్రుల ఔదార్యం
ధర్మపురి:ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి.. వైద్య ఖర్చుల కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఓ యువకుడికి సామాజిక మిత్రులు రూ. 1.52 లక్షలు విరాళాలు అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ధర్మపురికి చెందిన అక్కెనపెల్లి రాజే శం, అంజలి దంపతుల కుమారుడు రాజు (42) ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తల్లిదండ్రులు అప్పు చేసి బ్రెయిన్ సర్జరీ చేయించా రు. అయినప్పటికీ నయం కాలేదు. మరోసారి బ్రెయిన్ సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. నాలుగేళ్ల క్రితం రాజు తండ్రి చనిపోయా డు. ప్రస్తుతం తల్లి అంజలితో కలిసి ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. సర్జరీ చేయాలంటే రూ.లక్షకు పైగా ఖర్చవుతుండగా.. ఆ మొత్తం లేనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రాజు పరిస్థితిని తెలుసుకు న్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ జూలై 4న ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి సాయం కోరాడు. స్పందించిన ఎన్నారైలు, స్థానికులు అంజలి బ్యాంకు ఖాతాకు రూ.1.52లక్షలు విరాళాల రూపంలో అందించారు. వాటిని స్థానిక సీఐ రాంనర్సింహారెడ్డి ఎస్సై ఉదయ్‌కుమార్, యూనియన్ బ్యాంకు మేనేజర్ మాధవరావుతో కలిసి బాధిత కుటుంబానికి అందించారు. త్వరలోనే రాజుకు ఆపరేషన్ చేస్తారని రమేశ్ తెలిపాడు.