‘భూ భారతి’తో రైతులకు మేలు | - | Sakshi
Sakshi News home page

‘భూ భారతి’తో రైతులకు మేలు

Apr 29 2025 12:16 AM | Updated on Apr 29 2025 12:16 AM

‘భూ భ

‘భూ భారతి’తో రైతులకు మేలు

మేడిపల్లి/వెల్గటూర్‌: ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం రైతులకు మేలు చేస్తుందని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. మేడిపల్లిలోని రైతు వేదికలో, ఎండపల్లి మండలం రాజారాంపల్లిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో అవగాహన కల్పించారు. రైతులు ఈ చట్టంపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలని అన్నారు. వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కుల సంక్రమిస్తే తహసీల్దార్‌ విచారణ జరిపి రికార్డుల్లో మ్యూటేషన్‌ చేస్తారని పేర్కొన్నారు. ఆధార్‌కా ర్డు మాదిరిగానే భూదార్‌ కార్డు అందించనున్నట్లు వెల్లడించారు. మేడిపల్లిలో కోరుట్ల ఆ ర్డీఓ జివాకర్‌ రెడ్డి, తహసీల్దార్‌ వసంత, ఎంపీడీవో పద్మావతి, ఎండపల్లిలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్‌, డిప్యూటీ తహసీల్దార్‌ అనిల్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ గోపిక స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ధర్మపురిలో ఆయుష్య హోమం

ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహాస్వామి అనుబంధం యమధర్మరాజు ఆలయంలో వేద పండితులు పాలెపు ప్రవీణ్‌కుమార్‌ మంత్రోచ్ఛరణలతో సోమవారం ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి

● పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్‌ అంజిరెడ్డి

జగిత్యాలటౌన్‌: విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్‌ అంజిరెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని వాల్మీకి ఆవాసంలో తపస్‌ జిల్లా శాఖ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, పెండింగ్‌ బిల్లుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు నిధులు పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అంజిరెడ్డిని నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నరేందర్‌రావు, బోనగిరి దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

రహదారి ప్రమాదాలు తగ్గించాలి

అడిషనల్‌ కలెక్టర్‌ లత

జగిత్యాల: జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించాలని అడిషనల్‌ కలెక్టర్‌ లత, ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌లో రోడ్డు ప్రమాదాలపై సమీక్షించారు. జాతీయ రహదారులపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తూ మూడోసారి పట్టుబడితే లైసెన్స్‌ రద్దు చేయాలని సూచించారు. రోడ్డు సేఫ్టీ అందరి బాధ్యత అని, వచ్చే సమావేశానికి యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌లతో రావాలని ఆదేశించారు. ఆర్డీవోలు మధుసూదన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ స్పందన, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కోరుట్లలో బార్‌ ఏర్పాటుకు 24 దరఖాస్తులు

ప్రభుత్వానికి రూ.24 లక్షల ఆదాయం

జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ సత్యనారాయణ

జగిత్యాలక్రైం: ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలో మూసివేయబడిన ఓ బార్‌ స్థానంలో మరో బార్‌ ఏర్పాటుకు 24 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ సత్యనారాయణ తెలిపారు. ఈ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.24 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. దరఖాస్తు చేసుకున్న 24 మంది ఎంట్రీ పాస్‌లతో ఈనెల 29న ఉదయం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఉదయం 11 గంటలకు డ్రా పద్ధతి ద్వారా బార్‌ ఎంపిక ఉంటుందని తెలిపారు.

‘భూ భారతి’తో రైతులకు మేలు1
1/3

‘భూ భారతి’తో రైతులకు మేలు

‘భూ భారతి’తో రైతులకు మేలు2
2/3

‘భూ భారతి’తో రైతులకు మేలు

‘భూ భారతి’తో రైతులకు మేలు3
3/3

‘భూ భారతి’తో రైతులకు మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement