
కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది రానీయొద్దు
ధర్మపురి: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇ బ్బందులు కల్గించవద్దని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండలంలోని రాయపట్నంలో బుధవారం కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యంలో కోతలు విధించొద్దన్నారు. గన్నీ సంచులు, హమాలీల కొరత లేకుండా చూడాలని అన్నారు. ఏఎంసీ చైర్మన్ చిలుముల లావణ్య, నాయకులు రాందేని మొగిలి, ఎంపీ.రఫీయో ద్దీన్, రెవెన్యూ అధికారులు తదితరులున్నారు.
వెల్గటూర్‌లో..
వెల్గటూర్: కేంద్రాలను సద్వినియోగం చేసుకో వాలని విప్ న్నారు. ఎండపల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారులను న మ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ గోపిక, వైస్ చైర్మన్ తిరుపతి, సంఘ అధ్యక్షుడు రాంరెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం
మల్లాపూర్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దామని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుదామని డీఈవో రాము అన్నారు. మండలంలోని వాల్గొండ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం రూపొందించిన బడిబాట కరపత్రాలను డీఈవో తన కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. విద్యార్థుల సంఖ్యను పెంచే ఉద్దేశంతో ఉపాధ్యాయులు కరపత్రాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. మల్లాపూర్ ఎంఈవో దా మెదర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఎల్.రాజు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ కగార్‌ను నిలిపి వేయాలి
కోరుట్ల: అడవుల్లోని కోట్లాది ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందులోభాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ ముడిమడుగుల మ ల్లన్న అన్నారు. పట్టణంలోని సీ.ప్రభాకర్ స్మారక భవన్‌లో ఆదివాసీలపై దాడులకు వ్యతిరేకంగా ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆద్వర్యంలో ఈనెల 20న కరీంనగర్‌లో నిర్వహించే బహిరంగ సభ కరపత్రాన్ని బుధవారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 1990 నుంచి 2025 వరకు ఆది వాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టేందుకు అనే క రకాల ఆపరేషన్లు చేపట్టారని పేర్కొన్నారు. ఆదివాసీలపై ప్రభుత్వాలు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు, దళితులు, మేధావులు, హక్కుల కార్యకర్తలు అండగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల వేదిక కో–కన్వీనర్‌లు గుమ్మడి కొమురయ్య, రామిళ్ల బాపు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరుగుల రాజన్న, పొన్నం రాజమల్లయ్య, భూమేశ్వర్, చెన్నా విశ్వనాథం, రాజ భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.
తల్లిపాలు పిల్లలకు శ్రేష్టం
జగిత్యాలరూరల్: తల్లిపాలు చిన్నారులకు ఎంతో శ్రేష్టమని ఐసీడీఎస్ సీడీపీవో మమత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్‌లోని అంగన్‌వాడీకేంద్రంలో బుధవారం పోషణపక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణులు, రెండేళ్లలోపు చిన్నారుల ఎత్తు, బరువు నమోదు చేయాలని సూచించారు. బాలింతలకు మొదటి వెయ్యి రోజుల ప్రాముఖ్యతను వివరించారు. పౌష్టికాహారం తీసుకుంటే పిల్ల లు బరువు, ఎత్తు వేగంగా పెరుగుతారన్నారు. గర్భిణులు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. 1098 (చైల్డ్‌లైన్ హెల్ప్‌లైన్), 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్), గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. సూపర్‌వైజర్ లావణ్య, సెక్రెటరీ శ్రీనివాస్, చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారి రజిత, మహిళాసాధికారత అధికారి స్వప్న, గౌతమి, డాక్టర్ చాందిని, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది రానీయొద్దు

కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది రానీయొద్దు