ఒక్కసారిగా మైండ్‌ బ్లాక్‌!.. వెయిట్రస్‌కు కోట్ల విలువైన కారు టిప్‌గా ఇచ్చాడు

Youtuber Mrbeast Gave Brand New Car As Tip To Waitress - Sakshi

ప్ర‌ముఖ అమెరిక‌న్ యూట్యూబ‌ర్ మీస్టర్‌ బీస్ట్‌ అలియాస్‌ జిమ్మీ డొనాల్డ్‌సన్ ప్రపంచంలో అత్యధికంగా ఫాలోవర్లును సంపాదించుకున్నాడు. వెరైటీ కంటెంట్‌లతో నెటిజన్లకు ఎప్పటికప్పుడు వినోదాన్ని పంచుతుంటాడు ఈ యూట్యూబర్‌. అందుకే తన ఫాలోవర్లు సంఖ్య 139 మిలియన్లకు పెంచుకోగలిగాడు. త‌న బిజినెస్ వెంచ‌ర్స్‌ను ప్ర‌మోట్‌ చేసుకునేందుకు సరికొత్తగా ప్లాన్‌లు చేసే ఈ యూట్యూబర్‌ ఇటీవల ఓ వెయిట్రస్‌కు ఊహించని గిఫ్ట్‌ ఇచ్చి ఆమె ఆనందానికి అవధులు లేకుండా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట చ​క్కర్లు కొడుతోంది. 

ఊహించని టిప్‌..
 రెస్టారెంట్‌కు వెళ్లిన ఆ యూట్యూబర్‌ అక్కడ పని చేస్తున్న వెయిట్రెస్‌తో..  ఇంత వరకు నువ్వు అత్యధికంగా ఎంత టిప్‌ తీసుకున్నావు అని అడుగుతాడు. ఈ ప్రశ్నకు, ఆమె 50 డాలర్లు అని సమాధానమిస్తుంది. దాంతో ఇప్ప‌టివ‌ర‌కూ నీకు టిప్‌గా కారు ఎవరైన ఇచ్చారా అని అడుగుతూ తన కారు తాళాన్ని వెయిట్రెస్‌కు ఇస్తాడు. మొదట్లో ఆమె ఈ విషయాన్ని నమ్మదు గానీ తర్వాత ఆ యూట్యూబర్‌ తను కారును పార్క్ చేసిన ప్ర‌దేశానికి వెయిట్రెస్‌ను తీసుకువెళ్లి స‌ర్‌ప్రైజ్ చేస్తాడు.

బ్లాక్ ట‌యోటా కారును వెయిట్రెస్‌కు టిప్‌గా అందిస్తాడు ఆ యూట్యూబర్‌. టిప్‌గా ఇచ్చిన కారుపై త‌న చాక్లెట్ కంపెనీ ఫీస్ట‌బుల్ లోగో క‌నిపిస్తుంది. కస్టమర్‌ నుంచి కోట్లు ఖరీదైన కారుని టిప్‌గా అందుకోవ‌డంతో వెయిట్రెస్ ఆనందంలో మునిగి తేలిపోతుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యూట్యూబర్‌ ఔదార్యాన్ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top