యూట్యూబ్‌ మాజీ సీఈవో ఇంట్లో విషాదం

You Tube Ex Ceo Died In California University - Sakshi

కాలిఫోర్నియా: యూట్యూబ్‌ మాజీ సీఈవో సుసాన్‌ వుజిక్‌ కొడుకు మార్కో ట్రోపర్‌(19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాలిఫోర్నియాలోని బర్కేలి యూనివర్సిటీ కాలేజీలో ట్రోపర్‌ చదువుతున్నాడు. యూనివర్సిటీ క్యాంపస్‌లోని అతడి గదిలో ట్రోపర్‌ అచేతన స్థితిలో పడి ఉన్నాడు.

డాక్టర్లు ఎంత ప్రయత్నించినా అతడు స్పందించలేదు. దీంతో ట్రోపర్‌ మృతి చెందినట్లు ప్రకటించారు. డ్రగ్‌ ఇంజెక్షన్‌ ఓవర్‌డోస్‌ అవడం వల్లే ట్రోపర్‌ చనిపోయినట్లు అతడి  అమ్మమ్మ ఎస్తర్‌ తెలిపింది. ‘ట్రోపర్‌ ఒక గణిత మేధావి. అతడు ఇలా మృతి చెందడంతో గుండె పగిలిపోయింది. అతడు బతికి ఉంటే కచ్చితంగా ఏదైనా సాధించేవాడు’అని ట్రోపర్‌ అమ్మమ్మ కన్నీటి పర్యంతమైంది.

ఇదీ చదవండి.. ట్రంప్‌ను తెగ తిట్టిన ఆత్మ.. ఏఐ వీడియో వైరల్‌ 

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top