ఓ రేంజ్‌లో రివేంజ్‌ తీర్చుకున్న మహిళ.. ఏకంగా 20 ఏళ్లు కాపుగాసి..

Woman Seduces Colombian Drug Lord To Avenge Partners Death - Sakshi

మనం ఎంతగానో ప్రేమించే భాగస్వామీ లేదా ప్రియమైన వాళ్లు దూరమైతేనే తట్టుకోలేం. అలాంటిది ఎవరి వల్లనో మనవాళ్లను పోగొట్టుకుంటే.. ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. సినిమాల్లో హీరో లేదా హీరోయిన్‌ మాదిరి రివేంజ్‌ తీర్చుకోవడం అందరి వల్ల సాధ్య కాదు కూడా! కానీ కొందరూ మాత్రం చూస్తూ కూర్చోలేరు. ఏం చేసేందుకైనా తెగించి మరీ తమ రివేంజ్‌ తీర్చుకుంటారు. అచ్చం అలాంటి కోవకు చెందినదే కొలంబియాకు చెందిన మహిళ.

వివరాల్లోకెళ్తే.. కొలంబియాకు చెందిన మహిళ భర్త..  పేరు మోసిన డ్రగ్‌ వ్యాపారి రుబెన్ డారియో విలోరియా బారియోస్‌ చేతిలో హతమయ్యాడు. దీన్ని జీర్ణించుకోలేని సదరు మహిళ ఎలాగైనా అతడిపై రివేంజ్‌ తీర్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకోసం ఆ మహిళ.. డ్రగ్‌ వ్యాపారి కోసం గాలిస్తున్న ఇంటిలిజెన్స్‌ అధికారులతో చేతులు కలిపింది. ఆమె అనుకున్న ప్లాన్‌ ప్రకారమే..వలపు వల విసిరి మరీ అతడిని ప్రేమలోకి దించింది.

అతడితో ప్రేమాయాణం సాగిస్తూనే అతడికి సంబంధించిన విషయాలన్నింటిని ఎప్పటికప్పుడూ ఇంటిలిజెన్స్‌ అధికారులకు చేరవేసింది. ఒక రోజు ఆ మహిళ తన ‘ప్రియుడి’కి మోంటారియా అనే వ్యక్తిని కలిసేలా ఏర్పాటు చేసింది. ముందుగానే అతడికోసం మాటువేసి ఉన్న ఇంటిలిజెన్స్‌ అధికారులు అతడిని తక్షణమే అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

ఆ వ్యక్తిని పట్టుకోవడం కోసం గత పదేళ్లుగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. అతడిపై డ్రగ్స్‌, ఆయుధాల అక్రమ రవాణాకు సంబంధించి పలు కేసులు ఉన్నాయని ఇంటిలిజెన్స్‌ అధికారి కల్నల్‌ గాబ్రియేల్‌ గార్సియా అన్నారు. అతడిని జువాంచో అని కూడా పిలుస్తారని చెప్పారు. ఆ మహిళ సాయంతో పేరు మోసిన నిందితుడిని పట్టుకోగలిగామని అన్నారు.  చివరికి బాధిత మహిళ తన భర్తను పొట్టనబెట్టుకున్న నిందితుడు రుబెన్ డారియోకి 22 ఏళ్లు జైలు శిక్ష పడేలా చేసి తన ప్రతీకారం తీర్చుకుంది. 
(చదవండి: అన్నంత పని చేస్తున్న కిమ్‌! 'ఆయుధాలను పెంచాలని పిలుపు')

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top