ఏరులై పారిన రెడ్‌వైన్‌.. మందుబాబులు షాక్‌

Winery Tank Containing Red Wine Explodes In Spain - Sakshi

ఈ వార్త చదివిన మందుబాబులు.. తాము ఆ సమయంలో అక్కడ ఎందుకు లేమా అన్న ఫీలింగ్‌తో తెగ బాధపడిపోతారు. ఎందుకంటే డ్యామ్‌ నుంచి నీళ్లను ఎత్తితే ఎంత వేగంగా పరిగెడుతాయో అచ్చం అలాగే రెడ్‌వైన్‌ నిల్వ ఉంచిన ట్యాంక్‌ పగిలిపోవడంతో రెడ్‌వైన్‌ వరదలా పారింది. ఈ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. రెడ్‌వైన్‌ ఏరులై పారుతుంటే అక్కడ ఉన్న ఉద్యోగులు చూస్తూ నిలబడ్డారే తప్ప ఏం చేయలేకపోయారు. వరదలా పారుతున్న రెడ్‌వైన్‌ను వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. (చదవండి : వైరల్‌: గున్న ఏనుగు చిలిపి స్నానం)

ఈ వీడియో చూసి మందుబాబులు గుండెలు బాదుకుంటున్నారు. 'దీనమ్మా జీవితం.. ఒక్క చుక్క వైన్‌ దొరికినా బాగుండు.. ఆ సమయంలో మేం అక్కడా ఉన్న బాగుండు.. ఒక్క చుక్క రెడ్‌వైన్‌ను వదలకుండా తాగేవాళ్లం.' అంటూ కామెంట్లు పెడుతున్నారు.దాదాపు 49 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రక్తం లాగా కనిపిస్తుండడం చూసి కొందరు భయపడిపోతున్నారు. కాగా 1969 నుంచి ఉన్న ఈ వైనరీలో 1,570 హెక్టార్లకు పైగా ద్రాక్షతోటలు ఉన్నాయి. ఈ వీడియోను రేడియో అల్బాసెట్ తన ట్విట‌ర్‌లో పంచుకుంది. ఈ వీడియోను  ఇప్పటికవరకు 8.4 మిలియ‌న్ల మంది వీక్షించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top