Sri Lanka: Wild Elephant Make Fun Throw Dirt Man Viral - Sakshi
Sakshi News home page

Sri Lanka: సైలెంట్‌గా ఆ వ్యక్తి వెనక్కి వచ్చి.. ఈ అడవి ఏనుగు ఏం చేసిందో లుక్కేయండి

Jul 1 2022 1:33 PM | Updated on Jul 1 2022 3:44 PM

Wild Elephant Make Fun Throw Dirt Man Viral Sri Lanka - Sakshi

అడవి ఏనుగులు సాధారణంగా చాలా వయెలెంట్‌గా ఉంటాయి.

వైరల్‌: కొన్ని వీడియోలు గమ్మత్తుగా అనిపిస్తాయ్‌. ప్రమాదకరమే అయినా.. పెదాలపై నవ్వులు పూయిస్తాయి. అలాంటి వీడియోనే ఇది. ఓ వ్యక్తి దగ్గరికి సైలెంట్‌గా దూసుకొచ్చిన అడవి ఏనుగు.. అతని పైకి మట్టిని దంచి కొట్టి పక్కకు తప్పుకోమని ఎలా సైగ చేసిందో ఓ లుక్కేయండి.

వీడియోపై స్పష్టత లేకున్నా.. శ్రీలంకలోని యాలా నేషనల్‌ పార్క్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా అడవి ఏనుగులు చాలా వైల్డ్‌గా ప్రవర్తిస్తుంటాయి. కానీ, ఈ గజరాజు మాత్రం అలా కాదు. దానికి వయొలెన్స్‌ ఏ మాత్రం ఇష్టం లేదట!. ఆ ఏనుగుకి షార్ట్‌ టెయిల్‌ అనే ముద్దు పేరు కూడా ఉంది. పార్క్‌ను ఆనుకుని ఉన్న హోటల్స్ వెంట తరచూ కనిపిస్తుందని, అలాగని మనుషులపై దాడులు చేసిన దాఖలాలు మాత్రం ఇప్పటిదాకా లేవని స్థానికులు చెప్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement