కరోనా మూలాలు కనుక్కునే పనిలో డబ్ల్యూహెచ్‌ఓ

WHO team visits Wuhan hospital that had early virus patients - Sakshi

వూహాన్‌లో ఆస్పత్రులు సందర్శిస్తున్న నిపుణుల బృందం  

వూహాన్‌: చైనాలోని వూహాన్‌లో కరోనా వైరస్‌ మూలాలను కనుక్కోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యులు అధ్యయనం మొదలు పెట్టారు. కరోనా వైరస్‌ వచ్చిన తొలి రోజుల్లో రోగులకు చికిత్స చేసిన వూహాన్‌లో జిన్యింతన్‌ ఆస్పత్రిని శనివారం సందర్శించారు. చైనా శాస్త్రవేత్తలతో కలిసి మాట్లాడారు. జం తువుల ఆరోగ్యం, వైరాలజీ, ఫుడ్‌ సేఫ్టీ, ఎపిడిమాలజీలో నిపుణులతో కలిసి చర్చించారు. వైరస్‌ పుట్టుకకు గల కారణాలపై అన్ని వైపుల నుంచి అధ్యయనం చేస్తున్నారు. ఈ బృందంలో వివిధ రంగంలో నిష్ణాతులైన 10 మంది సభ్యులున్నారు. ‘కోవిడ్‌కి గల కారణమైన ఏ అంశాన్ని వదలకుండా అన్ని వైపుల నుంచి డబ్ల్యూహెచ్‌ఓ బృందం పరిశీలిస్తోంది’అని డబ్ల్యూహెచ్‌ఓ ట్వీట్‌ చేసింది.ఎన్నో రకాల గణాంకాలను పరిశీలించిన బృందం తొలుత వైరస్‌ సోకిన రోగులతో మాట్లాడనుంది. కరోనా వైరస్‌పై చైనా ముందస్తుగా ప్రపంచ దేశాల్ని హెచ్చరించలేదని, ఉద్దేశపూర్వకంగానే వైరస్‌ను వ్యాప్తి చేసిందని ఆరోపణలున్నాయి.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top